జగన్ దీక్ష భగ్నం: విజయమ్మ కంటతడి (పిక్చర్స్)
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షను ఎట్టకేలకు మంగళవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. ఆయన బలవంతంగా దీక్షా స్థలి నుంచి ఆస్పత్రికి తరలించారు.
వైయస్ జగన్ పరిస్థితి సోమవారం ఆందోళనకరంగా ఉంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వైయస్ విజయమ్మ, భారతి, షర్మిల గుంటూరులోని నల్లపాడు దీక్షాస్థలికి చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున దీక్షను విరమించాలని పోలీసులు జగన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కానీ, జగన్ వినకపోవడంతో బలవంతంగా ఆయనను లేపేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను, నాయకులను లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. ఆయన గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ఐసియులో చేర్చారు. ఆయన ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు.

ఆరు రోజులు సాగిన దీక్ష
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో మంగళవారం తెల్లవారుజామున ఆయనను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మంతనాలు జరిపే ప్రయత్నం చేసి...
మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో పెద్దయెత్తున పోలీసులు దీక్షా స్థలికి చేరుకున్నారు. మంతనాలు జరిపే ప్రయత్నం చేసి, అమాంతం జగన్‌ను అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు.

నో చెప్పిన జగన్
దీక్షను విరమించడానికి వైయస్ జగన్ నిరాకరించారు. అయితే, పోలీసులు వైద్యుల సూచన మేరకు ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

చికిత్సకు నిరాకరణ
ఆస్పత్రిలో చేరిన తర్వాత చికిత్స తీసుకోవడానికి వైయస్ జగన్ నిరాకరించారు. దీంతో వైద్యులు బలవంతంగా ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు.

కుటుంబ సభ్యుల పరామర్శ
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేరిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సభ్యులు వైయస్ విజయమ్మ, భారతి, షర్మిల పరామర్శించారు.

డీహైడ్రేషన్‌తో నీరసించిన జగన్
జగన్ దీక్ష సోమవారంనాటికి ఆరో రోజుకు చేరుకుంది. డీహైడ్రేషన్‌తో ఆయన పూర్తిగా నీరసించారు. ఆహారం గానీ ద్రవపదార్థాలు గానీ తీసుకోకపోతే ఆయన ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు.

నల్లపాడుకు చేరుకున్న కుటుంబ సభ్యులు
జగన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో జగన్ కుటుంబ సభ్యులు నల్లపాడుకు చేరుకున్నారు.

వైద్య పరీక్షలు ఇలా..
జగన్‌కు వైద్యులు సోమవారం పరీక్షలు చేయించారు. సోమవారం ఉదయం కాసేపు వేదికపై కూర్చుని ఆ తర్వాత పడుకుండిపోయారు.

విజయమ్మ కంటతడి
నల్లపాడు దీక్షాస్థలిలో తీవ్రంగా నీరసించి కూర్చోలేక పడుకున్న వైయస్ జగన్‌ను చూసి తల్లి వైయస్ విజయమ్మ కంటతడి పెట్టారు.

ఇలా ఆవేదన చెందారు...
జగన్ పరిస్థితిని చూసిన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు కంటతడి పెట్టారు. దాంతో దీక్షాస్థలి వద్ద సోమవారంనాడు కాస్తా ఉద్విగ్న పరిస్థితి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications