విభజన: వారు వినిపిస్తూ, ప్రణబ్ నవ్వుతూ (ఫోటోలు)

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విభజన వ్యతిరేక, అనుకూలవాదుల తాకిడి పెరిగింది. ఆయన శీతాకాలం విడిది ముగుస్తున్న తరుణంలో ఆ తాకిడి మరింత పెరిదింది. ప్రాంతాలవారీగా వివిధ పార్టీలు, సంఘాల నేతలు ఆదివారం ఆయనను కలిశారు. అందరూ రాష్ట్ర విభజనపైనే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇతర పార్టీల అధ్యక్షులు, ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులు పలు విడతలుగా ప్రణబ్‌ను కలిశారు.

గతంలో రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నేతలు మర్యాదపూర్వకంగా కలిసేవారు. ఒకటి రెండు నిమిషాల్లోనే బయటకు వచ్చేసేవారు. కానీ, ఈసారి విభజన పరిస్థితుల నేపథ్యంలో నేతలంతా వీలైనంత ఎక్కువ సేపు రాష్ట్రపతితో భేటీ అవుతున్నారు. తమ వాదన సుదీర్ఘంగా వినిపిస్తున్నారు. అయితే వారు చెప్పేదంతా సావధానంగా వింటున్న ప్రణబ్ ముఖర్జీ చిరునవ్వుతో సాగనంపుతున్నారు. తన మనసులో మాటను బయటపెట్టడం లేదు. అయితే ఆదివారం నాడు తనను కలిసిన సీమాంధ్ర కాంగ్రెస్ 'తిరుగుబాటు' ఎంపీలతో రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థుతుల్లో వాటికి ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రణబ్‌తో ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు భేటీ అయ్యారు.

ప్రణబ్ మఖర్జీతో గీతా రెడ్డి..

ప్రణబ్ మఖర్జీతో గీతా రెడ్డి..

ప్రణబ్ ముఖర్జీతో భారీ పరిశ్రమల మంత్రి జె. గీతా రెడ్డి సమావేశమయ్యారు. చిన్నారి నుంచి కానుక అందుకుంటూ ప్రణబ్ ఇలా..

ప్రణబ్‌తో మధు యాష్కీ

ప్రణబ్‌తో మధు యాష్కీ

2014 ఎన్నికల్లోపు తెలంగాణ రాష్ట్రం తధ్యమని ఎంపీ మధుయాష్కీ అన్నారు. ఆత్మ బలిదానాలకు మొదటి ముద్దాయి సోనియాగాంధీ అని విమర్శిస్తున్న కిషన్‌రెడ్డి గతం గుర్తు చేసుకోవాలని ప్రణబ్ ముఖర్జీతో భేటీ తర్వాత అన్నారు.

ప్రణబ్ ముఖర్జీతో జెపి

ప్రణబ్ ముఖర్జీతో జెపి

రాష్ట్ర విభజనపై తీవ్రంగా మండిపడుతున్న లోకసత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు.

తెలుగుదేశం తెలంగాణ నేతల భేటీ..

తెలుగుదేశం తెలంగాణ నేతల భేటీ..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆదివారంనాడు తెలుగుదేశం తెలంగాణ నేతలు కలిసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడారు.

ప్రణబ్ ముఖర్జీతో మర్రి శశిధర్ రెడ్డి

ప్రణబ్ ముఖర్జీతో మర్రి శశిధర్ రెడ్డి

ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణకు చెందిన శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి సమావేశమయ్యారు. మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ డిసిసి అధ్యక్షులతో ఇటీవల సమావేశమయ్యారు.

ప్రణబ్‌తో అంజన్ కుమార్ యాదవ్

ప్రణబ్‌తో అంజన్ కుమార్ యాదవ్

ప్రణబ్ ముఖర్జీని సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కలిశారు.

ప్రణబ్‌తో గుత్తా, రాజగోపాల్ రెడ్డి...

ప్రణబ్‌తో గుత్తా, రాజగోపాల్ రెడ్డి...

విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్రపతిని కోరినట్టు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వివరించారు. రాష్ట్రపతి తమను చిరునవ్వుతో ఆహ్వానించారని, 'మీ ఆకాంక్ష నెరవేరింద'న్న సంకేతాలు ఆ నవ్వులో కనిపించాయని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

ప్రణబ్‌తో పొన్నం..

ప్రణబ్‌తో పొన్నం..

డిసెంబర్ తొమ్మిది ప్రకటన నాటినుంచీ మా ఎంపీలం తెలంగాణ రాష్ట్రం సింగిల్ ఎజెండాగా పనిచేస్తున్నామని, తమది ధర్మపోరాటమని, ఈ పోరాటంలో తామే గెలుస్తామని రాష్ట్రపతితో భేటీ తర్వాత పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఐవైఆర్ కృష్ణా రావు..

ఐవైఆర్ కృష్ణా రావు..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు కలిశారు.

సీమాంధ్ర ఉద్యోగులు..

సీమాంధ్ర ఉద్యోగులు..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్డీని బిజెపికి చెందిన సీమాంధ్ర ఉద్యమ కమిటీ చైర్మన్ వై. రఘునందన్ బాబు తదితరులు కలిశారు.

సీమాంధ్ర న్యాయవాదుల నేత..

సీమాంధ్ర న్యాయవాదుల నేత..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్డీని సమైక్యాంధ్ర న్యాయవాదుల జెఎసి కన్వీనర్ సివి మోహన్ రెడ్డి, తదితరులు కలిశారు.

మల్లు భట్టి విక్రమార్క భేటీ..

మల్లు భట్టి విక్రమార్క భేటీ..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్డీతో శానససభ ఉపసభాపతి మల్లుభట్టి విక్రమార్క కలిశారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఎవరు చర్చను ప్రారంభించారు వంటి విషయాలను రాష్ట్రపతి అడిగినట్లు సమాచారం.

రాష్ట్రపతితో పి. శంకరరావు భేటీ..

రాష్ట్రపతితో పి. శంకరరావు భేటీ..

ఎమ్మెల్యే పి. శంకరరావు తన కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రపతిని కలిశారు. కేంద్రం పంపిన బిల్లుని రాష్ట్ర అసెంబ్లీ సవరించడం కుదరదని, అభిప్రాయాలు మాత్రమే చెప్పాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాను సోనియా గుడి నిర్మిస్తున్నానని చెప్పగా, ప్రణబ్ 'వెరీ నైస్' అన్నారని మాజీ మంత్రి పి.శంకర్‌రావు తెలిపారు.

ఉత్తరాఖండ్ గవర్నర్

ఉత్తరాఖండ్ గవర్నర్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్డీని ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ అజీజ్ ఖురేషీ కలిశారు. వారిద్దరి మధ్య ఏ విధమైన సంభాషణ జరిగిందనేది తెలియదు.

రాష్ట్రపతితో పొన్నాల లక్ష్మయ్య

రాష్ట్రపతితో పొన్నాల లక్ష్మయ్య

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణకు చెందిన ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా కలిశారు.

రాష్ట్రపతిని కలిసిన సీమాంధ్ర ఎంపీలు

రాష్ట్రపతిని కలిసిన సీమాంధ్ర ఎంపీలు

ఆదివారం నాడు తనను కలిసిన సీమాంధ్ర కాంగ్రెస్ 'తిరుగుబాటు' ఎంపీలతో రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థుతుల్లో వాటికి ప్రాధాన్యత సంతరించుకుంది. అవసరమైతే అసెంబ్లీలో బిల్లుపై చర్చకు గడువును పెంచుతానని రాష్ట్రపతి సూచనప్రాయంగా చెప్పినట్లు వారు భావిస్తున్నారు.

రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటానని ప్రణబ్ తమకు చెప్పినట్లు సీమాంధ్ర ఎంపీలు మీడియాకు తెలిపారు. ఇక లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణతో రాష్ట్రపతి చాలా సేపు భేటీ అయినట్లు, పలు అంశాలపై మాట్లాడినట్లు ఇతర నేతలు చెబుతున్నారు. ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ మధుయాష్కీతోనూ ప్రణబ్ సుధీర్ఘంగా సమావేశమయ్యారు.

అలాగే తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు, బీజేపీ సీమాంధ్ర నేతలు కూడా ఆయన్ను కలిశారు. హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచీ ఇరు ప్రాంతాల నేతలు కలుస్తూనే ఉన్నారని, అందరూ రాష్ట్ర విభజన అంశాన్నే ప్రస్తావిస్తున్నారని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. కాగా, రాజ్యాంగ నిష్ణాతులైన ప్రణబ్ ముఖర్జీ సీనియర్ న్యాయవాది ముందు జూనియర్ న్యాయవాది ఎలా వ్యవహరిస్తారో అదే విధంగా నడుచుకున్నారని ఎంపీ మధుయాష్కీ వంటి వారు చెబుతున్నారు.

విభజన నిజమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతితో ఆదివారం టీ- కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. బిల్లు పార్లమెంట్‌కు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని తాము రాష్ట్రపతిని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+