పురంధేశ్వరికి టిడిపి ఎంట్రీ: బాబుతో రాయబారాలు
హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు దంపతుల తెలుగుదేశం ఎంట్రీకి పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో రాయబారాలు నడుస్తున్నట్లు వినికిడి. చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలకు సన్నిహితులైన అమెరికాలోని కుటుంబ సభ్యులు మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. చంద్రబాబు కుటుంబంతో దగ్గుబాటి కుటుంబ సభ్యుల రాజీకి ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలోకి రావటానికి దగ్గుబాటి వెంకటేశ్వరావు సుముఖంగా ఉన్నారని సమాచారం. అయితే టిడిపి అధినేత మాత్రం వారిని పార్టీలోకి చేర్చుకొనే విషయంలో మౌనం పాటిస్తున్నారు. గత దశాబ్దంన్నర కాలం నుంచి చంద్రబాబుతో ఎడమొగం, పెడమొగంగా ఉంటున్న దగ్గుబాటి వుంకటేశ్వరావు క్రమంగా మనసు మార్చుకొంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చినప్పటికీ, పార్టీలో చర్చించి ఒక నిర్ణయానికి రావాలనే యోచనలో చంద్రబాబు వున్నారని సమాచారం.

రాష్ర్ట విభజన వల్ల దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్‌కు దూరం అయ్యారు. తర్వాత పురందేశ్వరి భారతీయ జనతా పార్టీలో చేరి కడప జిల్లా రాజంపేట నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. నిజానికి, పురందేశ్వరి ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్లైతే ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కేది. ఓటమి తర్వాత పురంధేశ్వరి గత కొన్ని రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు.
రాజకీయంగా చంద్రబాబుతో విభేదాలు ఉండటంతో ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా జరుపుకొనే వేడుకలలో తప్ప మరెక్కడా వీరు కలుసుకోవటంలేదు. అయితే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన తరువాత దగ్గుబాటి దంపతుల మనసులో మార్పు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య అమెరికాలో పురందేశ్వరి మాతృసంస్థలోకి వెళ్ళటానికి తనకు అభ్యంతరం లేదని తన మనస్సులో మాట బయటపెట్టారు.
పురందేశ్వరి మాటలను బట్టి టీడీపీలో చేరటానికి అనుకూలంగా ఉన్నా, అది ఏవిధంగా సాధ్యమనేది స్పష్టం కావటంలేదు. చంద్రబాబు వారిని పార్టీలో చేర్చుకుంటారా అనేది సంశయంగానే ఉంది. ఎన్టీఆర్ వారసత్వానికి తాను వారసుడిగా వచ్చి, ఆ తర్వాత తన కుమారుడు నారా లోకేష్‌ను ముందుకు తీసుకురావాలని చంద్రబాబు అనుకుంటున్నారు. దీంతో దగ్గుబాటి దంపతులను చేర్చుకుంటే పార్టీలో సమీకరణాలు మారి తన వ్యూహానికి విఘాతం కలిగే ప్రమాదం ఉంటుందా అనే కోణంలో చంద్రబాబు ఆలోచించే అవకాశాలున్నాయని అంటున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications