రాహుల్ జాకెట్: రేణుకా చౌదరికి రూ.700తో బిజెపి నేత కౌంటర్
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాకెట్ ఖరీదు హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ గాంధీ వేసుకున్న జాకెట్ రూ. 700కు దొరుకుతుందని, కావాలంటే తాను ప్రధాని మోడీకి కొని పెడుతానని పరిహాసమాడిన కాంగ్రెసు నేత రేణుకా చౌదరి మాటలను బిజెపి నేత ఒకరు సీరియస్‌గానే తీసుకున్నట్లున్నారు.
ఢిల్లీ బిజెపి నాయకుడొకరు ఆమెకు రూ. 700 పంపించారు. అలా పంపించి తనకు అలాంటి జాకెట్ ఒకటి కావాలని ట్వీట్ చేశారు. బుధవారం రాత్రి చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు దేశ రాజధానిలో హాట్ టాపిక్‌గ మారింది.

రేణుకా చౌదరి వ్యాఖ్యపై..
రాహుల్ గాంధీ వేసుకున్న జాకెట్ ఖరీదు రూ. 70 వేల ఖరీదు చేస్తుందని బిజెపి చేసిన ట్వీట్‌ను రేణుకా చౌదరి హేళన చేశారు. రూ.700కు అటువంటి జాకెట్ తాను కొనిస్తానని ఆమె అన్నారు. దాంతో తేజీందర్ బగ్గా అనే ఢిల్లీ బిజెపి నేత పేటియం ద్వారా రేణుకా చౌదరికి డబ్బులు పంపించి సవాల్ చేశారు.

నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదంటూ
రాహుల్ గాంధీపై చేస్తున్న విమర్శలు బిజెపి నిస్పృహకు నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదని, కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో గాలించి ఇలా రేట్లు ఊహించుకుంటున్నారని రేణుకా చౌదరి అన్నారు. ఆ జాకెట్ రూ.700కు దొరుకుతుందని, కావాలంటే తాను మోడీకి పంపిస్తానని, 56 ఇంచుల ఛాతీ అంటూ చెప్పుకునే మోడీ కొలతలు తమకు తెలియవని ఆమె అన్నారు.

జాకెట్‌తో రాహుల్ గాంధీ
షిలాంగ్‌లో మంగళవారం జరిగిన ఓ సంగీత కార్యక్రమానికి రాహుల్ గాంధీ ఖరీదైన జాకెట్ ధరించి హాజరయ్యారు. దాన్ని గమనించిన బిజెపి మేఘాలయ విభాగం ట్విట్టర్‌లో విమర్శలు చేసింది. దాదాపు 70 వేల రూపాయల ఖరీదు చేసే లగ్జరీ జాకెట్ ధరించారని ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

రాహుల్ గాంధీపై బిజెపి విమర్శ
మేఘాలయ ప్రజల గురించి పట్టించుకోకుండా, రాష్ట్రంలోని అసమర్థ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ వంత పాడుతారా అని బిజెపి ప్రశ్నించింది. రాహుల్ ప్రదర్శిస్తున్న పక్షపాతం మేఘాలయ ప్రజలను వెక్కిరిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించంది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం రాహుల్ గాంధీ మేఘాలయ వెళ్లారు.












Click it and Unblock the Notifications