వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు ఎమ్మెల్సీకి, నేడు ఎమ్మెల్యేకు రేవంత్‌ రాజీనామా: గెలిస్తేనే అసెంబ్లీకి

కెసిఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై అసెంబ్లీలో సునిశిత విమర్శలు గుప్పించే రేవంత్‌రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేవరకు అసెంబ్లీకి హజరయ్యే అవకాశాలు కన్పించడం లేదు. రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కెసిఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై అసెంబ్లీలో సునిశిత విమర్శలు గుప్పించే రేవంత్‌రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేవరకు అసెంబ్లీకి హజరయ్యే అవకాశాలు కన్పించడం లేదు. రేవంత్‌రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపారు. అయితే ఈ రాజీనామాను స్పీకర్‌ ఆమోదించాల్సి ఉంది. రాజీనామాను స్పీకర్ ఆమోదించేవరకు రేవంత్‌ అసెంబ్లీకి హజరుకావొచ్చు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తాను పాల్గొనబోనని రేవంత్‌ ప్రకటించారు.

వారిద్దరూ స్నేహితులు: నరేందర్‌‌రెడ్డి కోసం కేసులోకి రేవంత్వారిద్దరూ స్నేహితులు: నరేందర్‌‌రెడ్డి కోసం కేసులోకి రేవంత్

Recommended Video

Revanth Reddy Resigned For TDP ఉత్కంఠకు తెర.. టీడీపీకి గుడ్ బై..

రేవంత్‌రెడ్డి టిడిపిని వీడారు. పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ఎమ్మెల్యే పదవికి కూడ రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్‌కు కూడ రేవంత్‌రెడ్డి తన రాజీనామాలేఖను పంపారు.

రేపు అమరావతికి రేవంత్‌రెడ్డి: చంద్రబాబు వద్ద మెలికలు?రేపు అమరావతికి రేవంత్‌రెడ్డి: చంద్రబాబు వద్ద మెలికలు?

ట్విస్ట్: నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్ట్విస్ట్: నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్

'రేవంత్‌‌పై బాబుదే తుది నిర్ణయం, తప్పు చేశానని నిరూపిస్తే తప్పుకొంటా''రేవంత్‌‌పై బాబుదే తుది నిర్ణయం, తప్పు చేశానని నిరూపిస్తే తప్పుకొంటా'

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చేరనున్నారు. రేవంత్‌తో పాటు మరికొందరు టిడిపి నేతలు పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టిడిపికి చెందిన కీలకనేతలు రేవంత్‌ వెంట వెళ్ళే అవకాశం ఉందంటున్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే అసెంబ్లీలోకి రేవంత్

ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే అసెంబ్లీలోకి రేవంత్

ఈ నెల 27వ, తేది నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం రోజున రేవంత్‌రెడ్డి అసెంబ్లీకి హజరయ్యారు. అయితే ఈ సమావేశాల్లో డ్రగ్స్‌కేుసు విషయమై రేవంత్‌రెడ్డి ప్రశ్న వేశారు. అయితే ఈ ప్రశ్న సభలో చర్చకు రాకుండానే సభ వాయిదాపడింది. అయితే ఈ విషయమై రేవంత్‌రెడ్డి ప్రభుత్వపెద్దలపై విమర్శలు గుప్పించారు. తనపై కేసులు పెట్టుకోవాలని సవాల్ విసిరారు. అయితే పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు.ఇంకా ఆయన రాజీనామా ఆమోదం పొందలేదు. రాజీనామా ఆమోదించడం లాంఛనమేననే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రాజీనామా ఆమోదం పొందే వరకు కూడ తాను అసెంబ్లీకి హజరుకాబోనని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే రేవంత్‌రెడ్డి అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.

ఎమ్మెల్సీ పదవికి కూడ ఇలానే రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి కూడ ఇలానే రాజీనామా

2007లో టిడిపి మద్దతుతోనే రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్‌రెడ్డిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలముంది. ఆ సమయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు.2009లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి రేవంత్‌రెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ స్థానం నుండి రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడ రేవంత్‌రెడ్డి అదే అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు.2009 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికాలం ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయినా రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

అసెంబ్లీ సాఫీగా నడిచేనా?

అసెంబ్లీ సాఫీగా నడిచేనా?

ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ కంటే విమర్శలు ఎక్కుపెట్టడంలో రేవంత్‌రెడ్డి దిట్ట. పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదం పొందేవరకు కూడ అసెంబ్లీకి హజరుకాకూడదని నిర్ణయం తీసుకొన్నారు.ఈ పరిష్థితులు టిఆర్ఎస్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరూ మినహ ప్రభుత్వ తీరును పెద్దగా ఎండగట్టే పరిస్థితులు లేకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా వెనుక....

ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా వెనుక....

టిడిపి నుండి టిఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై రేవంత్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి స్పీకర్‌కు కూడ పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్న రేవంత్‌రెడ్డి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించినందున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా ఇరుకునపడే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకొన్నారంటున్నారు విశ్లేషకులు.

English summary
Revanth Reddy decided to didn't attend to Assembly till resignation acceptance.Revanth Reddy resigned to MLA post on Friday evening. He will enter in to Assembly after re elect as a MLA from kodangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X