వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్‌ ను వీడిన కీలక అధికారి.. విశాల్‌ సిక్కాకు భారీ ఎదురుదెబ్బ, కంపెనీలో పలు మార్పులు

ఇన్ఫోసిస్‌ అమెరికాస్ హెడ్ , రిటైల్ యూనిట్ గ్లోబల్ అధిపతి సందీప్ డాడ్లని తన పదవికి రాజీనామా చేయడంతో ఆ కంపెనీ సీఈవో సీఈవో విశాల్‌ సిక్కాకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇటీవలి కాలంలో వ్యవస్థాపకుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కాకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ అమెరికాస్ హెడ్ , రిటైల్ యూనిట్ గ్లోబల్ అధిపతి సందీప్ డాడ్లని తన పదవికి రాజీనామా చేశారు.

ఈ కంపెనీ కృత్రిమ మేధస్సు వేదిక నియా సహా కొత్త సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ నుంచి మరింత వ్యాపారాన్ని సృష్టించే యోచనలో విశాల్‌ సిక్కా ఇటీవలే డాడ్లాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

కంపెనీ వీడారు.. కారణం తెలియదు

కంపెనీ వీడారు.. కారణం తెలియదు

ఇన్ఫోసిస్ ప్రతినిధులు కర్మేష్‌ వాస్వాని, నితీష్ బంగ ఈ పరిణామాన్ని నిర్ధారిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే సందీప్ డాడ్లని కంపెనీని ఎందుకు వీడారనే అంశంపై స్పష్టత లేనప్పటికీ గత వారమే ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 2001 జనవరిలో ఇన్ఫోసిస్ లో చేరిన డాడ్లని 2014 లో ఆ సంస్థలో ఉన్నతోద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఇన్ఫోసిస్ నలుగురు ప్రెసిడెంట్లలో ఒకరైన డాడ్లని, ఇన్ఫోసిస్ పూర్తిస్థాయి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ‘ఎడ్జ్ సెర్వ్‌'కి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.

మున్ముందు మరింత గడ్డు కాలం?

మున్ముందు మరింత గడ్డు కాలం?

ఇన్ఫోసిస్ కు రిటైల్ జెయింట్స్ వాల్-మార్ట్ స్టోర్స్ ఇన్ కార్పొరేషన్ మరియు బెస్ట్ బై కో సంస్థల నుంచి వ్యాపారం క్రమేపీ క్షీణిస్తోంది. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌ సంస్థలతోపాటు, రిటైల్ కంపెనీలు ఇన్ఫోసిస్ కు రెండో అతిపెద్ద కొనుగోలుదారులుగా ఉన్నాయి. వీరు ఎక్కువగా ఆన్‌లైన్‌ సేవల వైపు మొగ్గు చూపడంతో అసలే ఇబ్బందుల్లో ఉన్న ఇన్ఫోసిస్కు తాజాగా బిజినెస్‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాజీనామాతో సిక్కాకు మున్ముందు మరింత గడ్డు కాలమేనని నిపుణులు భావిస్తున్నారు.

జనరల్ కౌన్సిల్‌ గా ఇంద్రప్రీత్ సావ్నీ..

జనరల్ కౌన్సిల్‌ గా ఇంద్రప్రీత్ సావ్నీ..

ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ శుక్రవారం కీలక నియామకాలను చేపట్టింది. మరో ఐటీ దిగ్గజం విప్రో మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంద్రప్రీత్ సావ్నీని జనరల్ కౌన్సిల్‌ కు ఎంపిక చేసింది. ఈ నియామకం జూలై 3, 2017 నుండి అమల్లోకి వస్తుందని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రీటైల్‌ గ్లోబల్‌ హెడ్‌కు పదవికి రాజీనామా చేసిన సందీప్‌డాడ్లాని స్థానాన్ని కూడా భర్తీ చేసింది. ఇంద్ర ప్రీత్‌ సావ్నీ విప్రోలో చేరడానికి ముందు సిలికాన్ వ్యాలీలో మిడ్-సైజ్డ్ న్యాయ సంస్థకు మేనేజింగ్ భాగస్వామిగాను, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీలో అంతర్గత సలహాదారుగా పనిచేశారు. ఇన్పోసిస్ లో యాక్టింగ్‌ జనరల్‌ కౌన్సిల్‌గా ఉన్న గోపీ కృష్ణన్‌ రాధాక్రిష్ణన్‌ రాజీనామా చేయడంతో ఈ స్థానాన్ని ఈమె భర్తీ చేయనున్నారు.

ఇంద్ర ప్రీత్‌ అనుభవజ్ఞురాలు: విశాల్ సిక్కా

ఇంద్ర ప్రీత్‌ అనుభవజ్ఞురాలు: విశాల్ సిక్కా

ఈ నియామకాలపై ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా మాట్లాడుతూ 24 ఏళ్ల కెరీర్‌లో ఇంద్ర ప్రీత్‌కు విభిన్నమైన ప్రపంచ అనుభవం ఉందని, తన నైపుణ్యం ఇన్ఫోసిస్‌ ప్రారంభించిన "ట్రాన్స్ఫర్మేషన్ జర్నీకి" బాగా ఉపయోగపడనుందని చెప్పారు. అలాగే మూడేళ్లుగా వాస్వానీ , బాంగాతో తాను కలిసి పనిచేశాననీ, వారిపై తమకు అపారమైన విశ్వాసముందన్నారు. ఖాతాదారుల డిజిటల్ ఆకాంక్షలను సాధించడంలో వీరిరువురికి గొప్ప సామర్థ్యం ఉందన్నారు.

ఆయన బాధ్యతలు ఇద్దరికి...

ఆయన బాధ్యతలు ఇద్దరికి...

మరోవైపు రాజీనామా చేసిన మరో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ సందీప్‌ డాడ్లాని బాధ్యతలను రెండుగా విభజించారు. సీపీజీ, అండ్‌ లాజిస్టిక్‌ , రీటైల్‌ గ్లోబల్‌హెడ్‌గా కర్మేష్‌ వాస్వాని, మాన్యఫాక్చరింగ్‌ హెడ్‌ గా నితీష్‌బంగ వ్యవహరించనున్నారు. ఈ నియామాకాలు జూలై 15 నుంచి అమలు కానున్నాయి. దాదాపు దశాబ్దకాలంపాటు వాస్వానీ, బాంగా వ్యూహాత్మక పోర్ట్ ఫోలియోలను నిర్వహించారు.

English summary
Infosys Ltd Americas head and global head of manufacturing and retail unit, Sandeep Dadlani, has resigned, in the biggest setback to chief executive officer Vishal Sikka who had recently entrusted Dadlani with the additional responsibility of generating more business from the company’s new software solutions, including the artificial intelligence platform Nia. The reason behind Dadlani’s departure is not clear. Infosys, on Friday announced the appointment of former Wipro executive Inderpreet Sawhney as its group general counsel. The appointment is effective from 3 July 2017, Infosys said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X