వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగ్లాదేశ్ సుప్రీం చీఫ్‌జస్టిస్‌గా తొలిసారి హిందువు శర్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢాకా: బంగ్లాదేశ్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సురేంద్ర కుమార్‌ సిన్హా నియమితులయ్యారు. ముస్లిం ప్రాబల్యం గల ఈ దేశంలో ఓ హిందువు ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. సుప్రీం కోర్టు అప్పిలేట్‌ డివిజన్‌ సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ సిన్హాతో అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్‌ హమీద్‌ ప్రమాణం చేయిస్తారు.

ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉంటారు. షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ హత్యతో పాటు 5, 13వ రాజ్యాంగ సవరణల కేసుల్లో జస్టిస్‌ సిన్హా సంచలన తీర్పులిచ్చారు. యుద్ధనేరాల కేసుల విచారణలో అప్పీళ్ల జడ్జిగా వ్యవహరించారు. ఈ నెల 17న చీఫ్‌ జస్టిస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

Surendra Kumar Sinha appointed next chief justice of Bangladesh

ఎస్కే శర్మ సుప్రీం కోర్టులో చాలా సీనియర్ జడ్జి. శర్మ వయస్సు 64 ఏళ్లు. అతను జనవరి 17వ తేదీన బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుతం చీఫ్ జస్టిస్‌గా ఉన్న ముజామేల్ హోసేనీ జనవరి 16న రిటైర్ కానున్నారు. బంగ్లాదేశ్ సుప్రీం కోర్డులో రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి అప్పాలేట్ డివిజన్, రెండోది హైకోర్టు డివిజన్.

సిన్హా తన ఎల్ఎల్బీ అనంతరం 1977లో అడ్వోకేట్‌గా డిస్ట్రిక్ట్ కోర్టులో ఎన్ రోల్ చేసుకున్నారు. 1977 వరకు స్వతంత్రంగా కేసులు తీసుకున్నారు. హైకోర్టు అడ్వోకేట్‌గా, అప్పాలేట్ డివిజన్‍‌కు 1978, 1990లలో ఎన్ రోల్ చేసుకున్నారు. హైకోర్టు జడ్జిగా 1999లో నియమితులయ్యారు. అప్పాలేట్ డివిజన్ జడ్జిగా 2009లో నియమితులయ్యారు.

English summary
Justice S K Sinha was on Monday appointed chief justice of Bangladesh to become the first Hindu to hold the highest judicial post in the Muslim-majority country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X