సర్వేలు: జగన్‌కు షాక్, చంద్రబాబుకు ఘన విజయం

Recommended Video

    సర్వేలు: జగన్‌కు, చంద్రబాబుకు షాక్

    హైదరాబాద్: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షాక్ తప్పదా అనే అనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో కన్నా ఎక్కువ సీట్లతో ఘన విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

    చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయించారని వార్తలు వచ్చాయి. 2014లో కన్నా ఎక్కువ సీట్లను టిడిపి వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకుంటుందని సర్వేలు తెలియజేస్తున్నాయి.

    వచ్చే ఎన్నికల్లో టిడిపికి వచ్చే సీట్లు...

    వచ్చే ఎన్నికల్లో టిడిపికి వచ్చే సీట్లు...

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 140 నుంచి 145 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు వెల్లడించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో టీడిపి 103 సీట్లు గెలుచుకుంది. ఎపి శాసనసభలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి.

    రాయలసీమలో టిడిపి మెరుగు...

    రాయలసీమలో టిడిపి మెరుగు...

    రాయలసీమలో టీడిపి పరిస్థితి మెరుగైనట్లు సర్వేలో తేలిందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రకాశం,, నెల్లూరు జిల్లాలో మాత్రం టిడిపి బలహీనంగానే ఉంది. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే టిడిపికి 23 సీట్లు వచ్చాయి. కడప జిల్లాలోని పది సీట్లకు గాను టిడిపికి ఒక్కటే వచ్చింది. కర్నూలు జిల్లాలో 14 సీట్లు ఉంటే టిడిపికి నాలుగు సీట్లు వచ్చాయి.

     ఉభయ గోదావరి జిల్లాల్లో...

    ఉభయ గోదావరి జిల్లాల్లో...

    కాపు ఉద్యమం నడిచినప్పటికీ గోదావరి జిల్లాలో టిడిపి బలం చెక్కు చెదరలేదని, తన సీట్లను వచ్చే ఎన్నికల్లో నిలబెట్టుకుందని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గాను టిడిపి గత ెన్న్ికల్లో ఐదు సీట్లను గెలుచుకుంది. నెల్లూరు జిల్లాలో పది సీట్లు ఉంటే మూడు మాత్రమే గెలుచుకోగలిగింది.

     టిడిపి పథకాలతో సంతృప్తి..

    టిడిపి పథకాలతో సంతృప్తి..

    గతంలో టిడిపిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సర్వేలో తేలినట్లు సమాచారం. పింఛన్లు, రేషన్ సరఫరా, తదితర పథకాల పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నారు.

    నిరుద్యోగుల్లో అసంతృప్తి...

    నిరుద్యోగుల్లో అసంతృప్తి...

    అయితే, టిడిపి ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో కాస్తా అసంతృప్తి ఉన్నట్లు సర్వేలో తేలింది. ఎన్నికల ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ భృతి హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేయకపోవడంతో యువతలో అసంతృప్తి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

     ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి

    ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి

    కొన్ని చోట్ల శాసనసభ్యుల పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు సర్వేల్లో తేలింది. ప్రభుత్వ పనితీరు బాగున్నప్పటికీ శానససభ్యుల పనితీరు బాగులేదని అభిప్రాయపడుతున్నారు. దాదాపు 40 మంది శాసనసభ్యుల పనితీరు బాగాలేదని ఇటీవల చంద్రబాబు ఆంతరంగిక సమావేశంలో అన్నట్లు తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+