మోడీ జంబో కేబినేట్: అద్వానీ గైర్హాజరు, సుష్మా అలక!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అతిపెద్ద జంబో కేబినెట్‌గా అవతరించిన మోడీ కేబినెట్ పునర్యవస్థీకరణ కార్యక్రమానికి కేబినెట్ సహచరులతో పాటు బీజేపీ ముఖ్యనేతలందరికీ ఆహ్వానాలు పంపారు. అయితే ఈ ఆహ్వానాలు అందిన వారి జాబితాలో బీజేపీ కురువృద్ధుడు, ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీతో పాటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌లు హాజరు కాలేదు.

పార్లమెంట్ విషయాల్లో దిట్ట: ఎవరీ అహ్లువాలియా?
దీంతో ఈ కార్యక్రమానికి అద్వానీ ఎందుకు హాజరుకాలేదనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. అయితే అద్వానీ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని కార్యాలయం నుంచి అద్వానీకి ఆహ్వాన లేఖ వెళ్లిందట.

Sushma Swaraj did not attend today's Cabinet expansion ceremony

ముంబైలో ఉంటున్న అద్వానీ సోదరి షీలా ఆరోగ్యం మంగళవారం ఆకస్మికంగా విషమించిందట. దీంతో ఆమెను అక్కడి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అద్వానీ ఉన్న పళంగా ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరి వెళ్లిపోయారట. ఈ కారణంతోనే ఆహ్వానం అందినా అద్వానీ కేబినెట్ విస్తరణకు హాజరుకాలేదని ఆయన తరుపు అధికార ప్రతినిధి తెలిపారు.

తల్లి గెంటెస్తే! అనుప్రియను కేంద్రమంత్రిని చేసిన మోడీ

మరోవైపు సుష్మా స్వరాజ్ ఢిల్లీ పర్యటనకు వచ్చిన హంగేరీ విదేశాంగ శాఖ మంత్రి సమావేశం కారణంగానే తాను కేబినెట్ విస్తరణకు రాలేకపోయానని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తన తోటి సహచరులకు శుభాకాంక్షలు తెలిపారు.

"మంత్రివ ర్గం లో చేరుతున్న సహచరులందరికీ స్వాగతం, వారికి నా అభినందనలు" అని పేర్కొన్నారు. అంతేకాదు పనిలో పనిగా మీడియాకు ఆమె చురకలంటించారు. దీనిని అవకాశంగా తీసుకుని మీడియా దయచేసి 'ప్రమాణ స్వీకారానికి సుష్మా గైర్హాజరు' అనే శీర్షిక మాత్రం పెట్టకండి" అంటూ ట్వీట్‌ చేశారు.

ఆమె చేసిన ట్వీట్‌ను కేవలం కొన్ని గంటల్లోనే సుమారు 1500 సార్లు నెటిజన్లు రీట్వీట్‌ చేశారు. ట్విటర్‌లో ఆమెను అనుసరిస్తున్న రెండు వేల మందికి పైగా అభిమానులు 'లైక్‌' కొట్టారు.

అయితే సుష్మా స్వరాజ్ గైర్హాజరీకి అదొక్కటే కారణం కాదని, కేబినెట్‌లోకి కొత్తగా తీసుకుంటున్న నేతల పేర్లను తెలుసుకునే ఆమె అలకబూనారనే వాదన జాతీయ మీడియాలో వినిపిస్తోంది. మంగళవారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో
ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌గా ఉన్న ఎంజే అక్బర్‌ను మోడీ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు.

కాంగ్రెస్ ఎంపీ నుంచి మోడీ మంత్రివర్గంలోకి: ఎవరీ ఎంజే ఆక్బర్?

అంతేకాదు ఎంజే అక్బర్‌ను విదేశాంగ శాఖ సహాయమంత్రిగా ప్రధాని మోడీ నియమించారు. దీంతో తనకు చెక్ పెట్టేందుకే మోడీ, ఎంజే అక్బర్‌ను తన శాఖకు తీసుకువచ్చారని సుష్మా భావించిన కారణంతోనే ఆమె మంగళవారం నాటి మంత్రివర్గ విస్తరణకు హాజరుకాలేదన్న వాదన వినిపిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
External Affairs Minister Sushma Swaraj on Tuesday skipped the Modi cabinet expansion ceremony at the Rashtrapati Bhavan but made sure her move got no negative coverage in the press.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి