వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌కు చిక్కు?: ట్యాపింగ్‌పై కేంద్రం చాలా సీరియస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టెలికాం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ మంగళవారం మాట్లాడారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. తద్వారా తమ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేశారనే అభియోగంపై టీడీపీ ఆందోళనకు ఇప్పుడు బీజేపీ బాసటగా నిలుస్తోంది.

Tapping charges made by Chandrababu a serious matter: Ravi Shankar Prasad

టీడీపీ వ్యక్తం చేసిన తీవ్ర అభ్యంతరం సబబేనని రవిశంకర ప్రసాద్ చెప్పారు. టెలిఫోన్ సంభాషణ సారాంశం ఏమిటనేది విడిచిపెడితే అసలు ఒక ముఖ్యమంత్రి ఫోన్‌ను ట్యాపింగ్ చేయడమంటే అది తీవ్ర అభ్యంతరం అని ఆయన చెప్పారు.

కాగా, చంద్రబాబువిగా చెబుతున్న ఆడియో టేప్ సంభాషణలపై నిజానిజాలు తేలాల్సి ఉంది. ఆ గొంతు చంద్రబాబుదా లేక మరొకరిదా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్‌లో తేలనుంది. అయితే, ఫోన్ ట్యాప్ అయిందనే వాదన పైన మాత్రం టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

English summary
Modi government put its weight behind its ally and TDP chief Chandrababu Naidu on unauthorised phone tapping charges made by him and said it is a "serious matter".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X