బాబాయ్ బాలయ్య బాటలో హీరో తారకరత్న?

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: మరో నందమూరి హీరో రాజకీయాల్లోకి ప్రవేశించి చట్టసభలోకి అడుగు పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. హీరో తారకరత్న బాబాయ్ బాలయ్య బాటలో నడవాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

గత నెల రోజులుగా తారకరత్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో మకాం వేసి తన రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలుగు యువత నేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

'కాటమరాయుడు' సెట్లో నందమూరి హీరో(ఫొటో)

Tarakaratna may enter into politics

గత కొంత కాలంగా ఆయన సరైన సినిమా అవకాశాలు రావడం లేదు. దాంతో ఆయన రాజకీయాలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారట.

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నందమూరి కుటుంబం చేతుల్లో కాకుండా నారావారి కుటుంబం చేతుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితిలో తారకరత్నకు టికెట్ లభిస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయమే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Nandamuri hero Tarakaratna has decided to enter into politics.
Please Wait while comments are loading...