వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఆయన టార్గెట్: ఎవరీ సోము వీర్రాజు?

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకుని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. వరుస వ్యాఖ్యలతో చంద్రబాబును చిక్కుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సోము వీర్రాజు వెనక ఉన్నదెవరు: చంద్రబాబుతో కటీఫ్? సోము వీర్రాజు వెనక ఉన్నదెవరు: చంద్రబాబుతో కటీఫ్?

ఓ వ్యూహం ప్రకారమే సోము వీర్రాజు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా మారారు. అంతగా గుర్తింపు లేని సోము వీర్రాజు టిడిపి, బిజెపి వివాదం నేపథ్యంలో ప్రముఖ నేతగా మారిపోయారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు

తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు

సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కథేరు గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.

Recommended Video

Union Budget 2018 : బీజేపీతో టీడీపీ పొత్తు..ఇంటికి రాదు విత్తు
బిజెవైఎం అధ్యక్షుడిగా..

బిజెవైఎం అధ్యక్షుడిగా..

సోము వీర్రాజు బిజెవైఎం రాష్ట్రాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. బిజెపి ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సోము వీర్రాజును ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా పరిగణిస్తారు. ఆర్ఎస్ఎస్ తీసుకున్న నిర్ణయం మేరకే సోము వీర్రాజు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారనే అభిప్రాయం ఉంది.

సోము వీర్రాజు పవన్ కల్యాణ్‌కు దగ్గర

సోము వీర్రాజు పవన్ కల్యాణ్‌కు దగ్గర

సోము వీర్రాజు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు సన్నిహితులనే అభిప్రాయం ఉంది. ఆ కారణంగానే చంద్రబాబు ఎమ్మెల్సీ పదవికి బిజెపి నుంచి ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతారు. బిజెపికీ జనసేనకు మధ్య, తెలుగుదేశం పార్టీకీ జనసేనకు మధ్య గత ఎన్నికల్లో పొత్తు కుదర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు.

చంద్రబాబుతో పొత్తుకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం

చంద్రబాబుతో పొత్తుకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం

చంద్రబాబుతో బిజెపి పొత్తును ఆర్ఎస్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలకు చంద్రబాబు ఆటంకంగా మారినట్లు నమ్ముతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ సూచించినట్లు చెబుతున్నారు. ఆ కారణంగా చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా సోము వీర్రాజు ముందుకు వచ్చినట్లు సమాచారం

English summary
Somu Veerraju was mediator between to secure the alliance between Bharatiya Janata Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X