ఐఎఎస్‌‌లకు భారీ కుదుపు: వారికి షాక్, కెసిఆర్ వ్యూహం?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. ఒక్కసారిగా 27 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యమంత్రి ఎన్నికల వ్యూహంలో భాగంగా ఈ బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు. ఐఎఎస్ అధికారులను పెద్ద యెత్తున బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులతో వివాదాలకు దిగిన కలెక్టర్లపై కూడా బదిలీ వేటు పడింది. జనగామ కలెక్టర్ ఎ. శ్రీదేవసేన, మహబూబాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రీతి మీనాను ప్రభత్వం బదిలీ చేసింది. కొందరికి ప్రాధాన్యం లేని శాఖల్లోకి పంపించారు.

 రాజకీయ అవసరాలే ప్రధానంగా...

రాజకీయ అవసరాలే ప్రధానంగా...

వివాదాస్పద అధికారులకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కొందరిని పక్కకు తప్పించింది. వివాదరహితులకే కీలక బాధ్యతలు అప్పగించింది. ఏడుగురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

 వారికి పోస్టింగ్ ఇచ్చింది..

వారికి పోస్టింగ్ ఇచ్చింది..

ఆదివాసీలు, లంబాడాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో నిర్మల్‌, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్లుగా ఉన్న ఇళంబర్తి, చంపాలాల్‌, జ్యోతి బుద్ధా ప్రకాష్‌లను ఇంతకు బదిలీచేసి వెయిటింగ్‌లో పెట్టింది. ఆ ముగ్గురికి కూడా పోస్టింగ్‌ ఇచ్చింది.

 మధ్యంతర ఎన్నికలు రావచ్చునని..

మధ్యంతర ఎన్నికలు రావచ్చునని..

2018లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ప్రచారం నేపథ్యంలో భారీ సంఖ్యలో బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. . రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న జనగామ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్లకు స్థానచలనం కల్పించింది. నగర శివారులో భూముల వ్యవహారంతో పాటు సీఎంవోతో వివాదం నేపథ్యంలో కీలక ఐఏఎ్‌సకు అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారు.

 ఆమెకు అదనపు బాధ్యతలు

ఆమెకు అదనపు బాధ్యతలు

సీఎంవోలో పనిచేస్తున్న శాంతికుమారికి అదనంగా వైద్యఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమెకు వివాదరహితురాలనే పేరుంది. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలో కొంతకాలం రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐఏఎస్‌ రాజేశ్వర్‌ తివారికి రెవెన్యూ శాఖతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ పదవిలో ఉన్న బీఆర్‌ మీనాను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా ప్రాధాన్యం లేని పదవికి బదిలీ చేశారు.

 ఆయనను ఇలా చేశారు..

ఆయనను ఇలా చేశారు..

ఆబ్కారీ శాఖలో ఉన్న ఆర్‌వీ చంద్రవదన్‌ను సైతం ప్రాధాన్యం లేని పదవిలో నియమించారు. పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సరేష్‌ చందాను ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఢిల్లీలో ప్రభుత్వానికి అండగా నిలిచిన సీనియర్‌ ఐఏఎస్‌ అర్వింద్‌ కుమార్‌కు కీలకమైన పురపాలక శాఖ బాధ్యతలు అప్పగించారు.

 వారిని ఇలా బదిలీ చేశారు...

వారిని ఇలా బదిలీ చేశారు...

మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ను వికారాబాద్‌ కలెక్టర్‌గా నియమించారు. ఆదివాసీ, గిరిజనుల మధ్య వివాదానికి కూడా ఒక కారణమైన గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్‌.లక్ష్మణ్‌ను బదిలీ చేసి, ఆ స్థానంలో డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్తుకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఇదే వివాదంలో బదిలీ అయి పోస్టింగ్‌ కోసం చూస్తున్న డాక్టర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను ఎస్సీ అభివృద్ధి కార్యదర్శిగా నియమించారు. భూరికార్డుల నవీకరణలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న వాకాటి కరుణకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించి కొత్తగా సీసీఎల్‌ఏ కార్యాలయంలో భూపరిపాలన సంచాలకురాలిగా నియమించారు.

 ఆయనకు ఇలా పదవి...

ఆయనకు ఇలా పదవి...

నిర్మల్‌ కలెక్టర్‌గా ఆదివాసీల వివాదంలో బదిలీ అయిన డాక్టర్‌ కె.ఇళంబర్తిని రాష్ట్ర సమాచార శాఖలో కార్యదర్శిగా ప్రాధాన్యం లేని పదవికి బదిలీ చేశారు. ఇదే వివాదంలో బదిలీ అయి... పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న చంపాలాల్‌కు సైనిక సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఎంఆర్‌ఎం రావుకు ఖాళీగా ఉన్న నిజామాబాద్‌ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు.

 దేవసేన బదిలీ...

దేవసేన బదిలీ...

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో తగాదాకు దిగిన శ్రీదేవసేనను జనగామ కలెక్టర్‌ నుంచిపెద్దపల్లి కలెక్టర్‌గా బదిలీ చేశారు.యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా పనిచేస్తున్న అనితా రామచంద్రన్‌కు అదనంగా జనగామ కలెక్టర్‌ బాధ్యతలు ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులతో వివాదాలున్న మెదక్‌ కలెక్టర్‌ భారతి హోలికేరీను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. ఈ జిల్లా బాధ్యతలు సంగారెడ్డి కలెక్టర్‌ మాణిక్క రాజ్‌కన్నన్‌కు అప్పగించారు.

 శంకర్ నాయక్‌తో గొడవ కారణంగా..

శంకర్ నాయక్‌తో గొడవ కారణంగా..

మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌‌తో గొడవ పడిన కలెక్టర్‌ డాక్టర్‌ ప్రీతిమీనాను బదిలీ చేసి ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. నవీన్ మిట్టల్‌ను కాలేజియేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. పర్యాటక, సాంస్కృతి క శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు బిసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పూర్తి పదవీ బాధ్యతలు అప్పగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Collectors A. Sri Devasena of Jangaon and Dr Priti Meena of Mahbubabad, who had run-ins with local TRS legislators were on Tuesday shifted to other districts in a major reshuffle of bureaucrats.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి