వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ ధీమా, కేసీఆర్‌కి తాత సాక్షిగా సవాల్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రానున్న గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్‌ పదవిని కైవసం చేసుకుంటుందని టీడీపీ యువనేత నారా లోకేష్‌ ఆదివారం అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మియాపూర్‌ ఆల్విన్‌ కాలనీలో రక్తదాన, అన్నదాన శిబిరాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరగడంతో పాటు, గ్రేటర పీఠం దక్కించుకుంటామని సవాల్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నా అభివృద్ధి కనిపించడం లేదన్నారు.

మిగులు బడ్జెట్‌ 17వేల కోట్లు ఉంటే, రైతులు విద్యుత్‌ సంక్షోభంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలీసులకు కొత్తకార్లు, కేసీఆర్‌కు కొత్తకార్లు వచ్చాయే తప్ప ప్రజలకు వచ్చిన ప్రయోజనమేమీలేదన్నారు.

ఎన్టీఆర్ వర్దంతి

ఎన్టీఆర్ వర్దంతి

రాబోయే ఆరు నెలల్లో విద్యుత్‌, తాగునీటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. 200 మోగావాట్ల విద్యుత్‌ను తీసుకోమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినా కేసీఆర్‌ సర్కారు స్పందించడం లేదన్నారు.

ఎన్టీఆర్ వర్దంతి

ఎన్టీఆర్ వర్దంతి

గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయడానికి కార్యకర్తలు సమాయత్తం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణలో కొంతమంది నేతలు పార్టీని వీడినా, కార్యకర్తలు చెక్కుచెదరకుండా ఉన్నారని, ఆ బలంతోనే 2019 ఎన్నికల్లో జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ వర్ధంతి

ఎన్టీఆర్ వర్ధంతి

ప్రజాపాలన తెచ్చి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కే దక్కుతుందని మాజీ ఎంపీ, టీడీపీ నేత నామా నాగేశ్వర రావు అన్నారు.

ఎన్టీఆర్ వర్ధంతి

ఎన్టీఆర్ వర్ధంతి

ఎన్టీఆర్‌ 19వ వర్ధంతిని తెలుగుదేశం శ్రేణులు ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారు. ఖమ్మంలో నామాతోపాటు పలువురు టీడీపీ నేతలు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

ఎన్టీఆర్ వర్ధంతి

ఎన్టీఆర్ వర్ధంతి

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలని, ఇందకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని నామా విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్ వర్ధంతి

ఎన్టీఆర్ వర్ధంతి

రానున్న గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్‌ పదవిని కైవసం చేసుకుంటుందని టీడీపీ యువనేత నారా లోకేష్‌ ఆదివారం అన్నారు.

ఎన్టీఆర్ వర్ధంతి

ఎన్టీఆర్ వర్ధంతి

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మియాపూర్‌ ఆల్విన్‌ కాలనీలో రక్తదాన, అన్నదాన శిబిరాలను నారా లోకేష్ ప్రారంభించారు.

English summary
Telugudesam leader Nara Lokesh is slated to be appointed as general-secretary and elevated to the politburo at Mahanadu, the party’s annual conclave that is scheduled to be held at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X