Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Three Capitals : మూడు రాజధానులకు వైసీపీ ముందున్న మూడు మార్గాలివే !

ఏపీలో మూడు రాజధానుల విషయంలో కేంద్రం తాజా నిర్ణయాలతో వైసీపీకి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ప్రతికూలంగా వస్తే జగన్ ముందు మూడు మార్గాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికార వైసీపీకి కేంద్రం తాజా నిర్ణయాలు మింగుడు పడటం లేదు. విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధాని ఏర్పాటైందని, మూడు రాజధానులపై తమకు సమాచారం లేదని కేంద్రం చేసిన ప్రకటన, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు వైసీపీకి నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల్ని తిరిగి పట్టాలెక్కించేందుకు వైసీపీ ముందు మూడు మార్గాలు కనిపిస్తున్నాయి.

రాజధానులపై వైసీపీకి డబుల్ షాక్

రాజధానులపై వైసీపీకి డబుల్ షాక్

మూడు రాజధానుల విషయంలో ముందు నుంచీ దూకుడుగా ముందుకెళ్తున్న వైఎస్ జగన్ సర్కార్ ఆ క్రమంలో కేంద్రానికి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల్లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు మూడు రాజధానుల విషయంలో సహకరించాలని కోరుతూ వచ్చారు. అయినా కేంద్రం తాజాగా పార్లమెంటులో విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధాని ఏర్పాటైందని, దానికి నిధులిచ్చామని తేల్చిచెప్పేసింది. అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టులోనూ అమరావతికి అనుకూలంగా అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. దీంతో జగన్ సర్కార్ కు డబుల్ షాక్ తప్పలేదు.

వైసీపీ ముందు మూడు మార్గాలు

వైసీపీ ముందు మూడు మార్గాలు

మూడు రాజధానుల విషయంలో కేంద్రం ఇచ్చిన డబుల్ షాక్ నేపథ్యంలో వైసీపీ సర్కార్ ముందు మూడు దారులు కనిపిస్తున్నాయి. వీటిలో ఏదో ఒకటి కానీ, అంతకు మించి కానీ ఆప్షన్లను వెతుక్కోవడం ద్వారా ఈ గండం నుంచి గట్టెక్కేందుకు వైసీపీకి అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది విభజన చట్టంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో జరుగుతున్న పోరాటంపై తానూ ఇంప్లీడ్ అయి అసలు ఈ చట్టంలోనే లోపాలున్నాయని వాదించడం. అలాగే అసెంబ్లీ అధికారాల విషయంలో తమకే ఆధిక్యం ఉండాలని కేంద్రంలో అధికార ఎన్డీయేపై ఒత్తిడి పెంచి పార్లెమంటులో చట్టం చేయించడం. ఈ రెండింటితో పాటు జనంలోకి వెళ్లి ఎన్నికలకు ముందు మూడు రాజధానులపై కేంద్రంతో పాటు రాష్ట్రంలోని విపక్ష పార్టీలపై ఒత్తిడి పెంచడం వంటి ఆప్షన్లు ఉన్నాయి.

విభజన చట్టంపై పోరు

విభజన చట్టంపై పోరు

2014లో కేంద్రం ఏపీ-తెలంగాణను విభజన చట్టం ద్వారా రెండు ముక్కలు చేసింది. దీనిపై రాజకీయ పార్టీలు పోరాడకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్, రఘురామకృష్ణంరాజు, జయప్రకాష్ నారాయణ్ వంటి నేతలు పిటిషన్లు వేశారు. ఇలా దాఖలైన 32 పిటిషన్లపై విచారణ అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తోంది. రాజకీయ పార్టీల నుంచి, ప్రభుత్వాల నుంచి ఒత్తిడి లేకపోవడంతో సుప్రీంకోర్టు కూడా దీనిపై దృష్టిసారించలేదు. అయితే తాజాగా ఏపీ రాజధాని వ్యవహారంపై విచారణ సందర్భంగా ఈ ఆంశం కూడా తెరపైకి వచ్చింది. దీంతో విభజన చట్టాన్ని రాజధాని పిటిషన్లతో కలిపి విచారిస్తామని ప్రకటించింది. కానీ పిటిషనర్లు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో విడిగానే ఈ పిటిషన్లపై విచారణకు సిద్ధమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఇందులో ఇంప్లీడ్ అయితే రాజధానుల వ్యవహారాన్ని సవాల్ చేసే అవకాశముంది.

పార్లమెంటు చట్టం కోసం ఒత్తిడి

పార్లమెంటు చట్టం కోసం ఒత్తిడి

అలాగే వైసీపీ ముందు మరో ఆప్షన్ కూడా ఉంది. అసెంబ్లీకి రాజధానులు మార్చే అధికారం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా కేంద్రంతో మాట్లాడుకుని పార్లమెంటులో చట్ట సవరణ చేయించుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్దితుల్లో అమరావతికి మద్దతిస్తున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కార్.. మూడు రాజధానుల కోసం వైసీపీకి సహకరించే అవకాశం లేదు. అయితే 2024 ఎన్నికల నాటికి ఎన్డీయేకు ఇబ్బందులు ఎదురైతే మాత్రం ఈ డిమాండ్ కు అంగీకరించే అవకాశాలూ లేకపోలేదు. దీంతో వైసీపీకి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా దారులు తెరిచే ఉంటాయి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినా రాజ్యాంగ ధర్మాసనం, రిట్ అంటూ ఇతరత్రా ఆప్షన్లు కూడా ఎలాగూ అందుబాటులోనే ఉంటాయి. అయితే రాజధానుల అమలు ప్రక్రియ ఆలస్యం కావడం ఖాయం.

వైసీపీకి లాస్ట్ ఆప్షన్ అదే ?

వైసీపీకి లాస్ట్ ఆప్షన్ అదే ?

చివరిగా మూడు రాజధానుల అమలు విషయంలో పైన చెప్పిన అన్ని ఆప్షన్లు పనికిరాకపోయినా చివరిగా ప్రజా పోరాటం ద్వారా రాజకీయ నిర్ణయాల్ని ప్రభావితం చేసే ఆప్షన్ ఎలాగో ఉండనే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎంచుకున్న బాటను జగన్ కూడా ఎంచుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అమరావతికే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా మేలు చేసే రాజధానుల వ్యవహారంలో ఆయా ప్రాంతాల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది కాబట్టి.. ప్రజల్లోకి వెళ్లి రాజధానుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీకి లాస్ట్ ఆప్షన్ మిగిలే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇదంతా సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే మాత్రమే. అలా కాకుండా సుప్రీంలో సానుకూల తీర్పు వస్తే ఇవేవీ అవసరం ఉండవు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+