వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్: ఒబామా-ట్రంప్‌లకు అందనంత ఎత్తులో మోడీ

సర్జికల్ స్ట్రయిక్స్, నోట్ల రద్దు వంటివి సాహసోపేత నిర్ణయాలని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్స్ రేస్‌లోనూ మోడీ దూసుకుపోతున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2016 రేసులో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకెళ్తున్నారు. ఈ సర్వేకు మరో ఆదివారంతో చివరి రోజు. శనివారం నాటికి ప్రధాని మోడీ 18 శాతం ఓట్లతో ఉన్నారు.

పెద్ద నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రయిక్ దాడువలతో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్నే కాదు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఇవి సాహసోపేత నిర్ణయాలని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ప్రఖ్యాత అమెరికన్ న్యూస్ మ్యాగజైన్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్స్ రేస్‌లోనూ దూసుకుపోతున్నారు.

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

ఆదివారంతో ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. ఈ నెల 7న ఫలితాలు ప్రకటించనున్నారు. మోడీ పలు సంచలనాలకు కేంద్రబిందువు అయ్యారు. సార్క్ దేశాల్లో పాక్‌ను ఒంటరిని చేశారు. సర్జికల్ దాడులతో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పారు. తాజాగా నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో పెను సంచలనమే సృష్టించారు.

వీరు వెనుకబడ్డారు

వీరు వెనుకబడ్డారు


ఇలాంటి నిర్ణయాలతో ఆయన స్వదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంటివారు సైతం మోడీ కంటే వెనుకబడి ఉన్నారు. వారు దరిదాపుల్లోనే లేరు.

దూసుకెళ్తున్న మోడీ

దూసుకెళ్తున్న మోడీ

ప్రస్తుతం టైమ్స్ రీడర్స్ ఛాయిస్ ఓటింగ్‌లో 21 శాతం ఓట్లతో కొనసాగుతున్నారు. మోడీ తర్వాత స్థానంలో ఒబామా, వికిలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే, డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అయితే వీరికి కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.

వారికి అందనంత దూరంలో..

వారికి అందనంత దూరంలో..

ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50 లక్షల మంది టైమ్స్ రీడర్స్ ఓట్ల ఆధారంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటిస్తారు. సమీప ప్రత్యర్థులు ఎవరూ మోడీ ఓటింగ్ శాతానికి చేరువుగా లేకపోవడంతో ఇక ఆయన విజయం నల్లేరుమీద నడకలాగే కనిపిస్తోంది. అంటే 2016 టైమ్స్ రీడర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మోడీకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Will Narendra Modi be the Time's Person of the Year, 2016? PM maintains lead, way ahead of Barack Obama, Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X