మాటల తూటాలు:' ట్రంప్ వృద్దుడు', 'కిమ్ పొట్టోడు', యుద్ద సన్నాహలు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హవాయి: ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మధ్య నెలకొన్న మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరుకొంది. ట్రంప్ ఆసియా దేశాల పర్యటనలో సమయంలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో అమెరికా, దక్షిణకొరియాలు ఉత్తరకొరియాకు సమీపంలో యుద్ద విమానాలు చేరాయి. దీంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఆసియా దేశాల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు వ్యక్తిగతంగా కూడ వెళ్ళాయి. దీంతో ఇద్దరు నేతలు తీవ్రంగా దూషించుకొన్నారు.

 ట్రంప్ వృద్దుడంటూ కిమ్

ట్రంప్ వృద్దుడంటూ కిమ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. ట్రంప్‌ ఆసియా పర్యటన చేస్తున్న సమయంలో కిమ్‌ ఆయనపై వ్యక్తిగత మాటల దాడులు చేశారు. ట్రంప్‌ ఒక వృద్ధుడు, ఆయన వల్ల ఏం అవుతుందంటూ కిమ్‌ మాటల తూటాలు పేల్చాడు. ట్రంప్‌పై కిమ్ వ్యక్తిగత విమర్శలకు దిగాడు.

కిమ్ పొట్టోడు.. లావుగా ఉన్నాడు

కిమ్ పొట్టోడు.. లావుగా ఉన్నాడు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌‌ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగానే స్పందించారు. నేను ఎప్పుడన్నా.. కిమ్‌ పొట్టిగా ఉన్నాడు.. లావుగా ఉన్నాడు అని అన్నానా, నా స్నేహితుడిని నేను అలా అనగలనా? స్నేహంలో ఏదో ఒక రోజు నేను ఇలా వ్యాఖ్యానించవచ్చునేమో' అటూ ట్వీట్‌ చేశాడు.

ఉ.కొరియాపై అమెరికా యుద్ద సన్నాహలు

ఉ.కొరియాపై అమెరికా యుద్ద సన్నాహలు

డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియా పర్యటన కేవలం యుద్ధ సన్నాహాల్లో భాగంగా చేస్తున్నారని ఉత్తర కొరియా ఆరోపించింది. ఒక విధ్వంసకారుడు.. అణుయుద్ధం కోసం ఇక్కడ పర్యటిస్తున్నాడని ట్రంప్‌పై ఉత్తరకొరియా విమర్శలు గుప్పించింది. వియాత్నాంలో ట్రంప్‌ పర్యటనపైనా ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.

కిమ్‌పై అమెరికా విరుచుకుపడింది

కిమ్‌పై అమెరికా విరుచుకుపడింది

కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ ఉ. కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌ను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కిమ్ జంగ్ ఉన్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. క్షిపణి పరీక్షలు, అణుపరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచదేశాలకు కిమ్ చుక్కలు చూపిస్తున్నారు. కొరియా తీరును ఐక్యరాజ్యసమితి కూడ తప్పుబట్టింది. అయితే కొరియాపై ప్రపంచదేశాల నుండి ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ఈ సమయంలోనే ట్రంప్ ఆసియా దేశాల పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Donald Trump sarcastically responded Sunday morning to insults issued by North Korea that described the US President as a "destroyer" who "begged for nuclear war" during his tour of Asia.The North Korean statement also referred to Trump as a "dotard," a word meaning a very old person, and one the reclusive nation has used on him in the past.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి