వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును కార్నర్ చేసిన జైట్లీ బడ్జెట్: ఏం చేస్తారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చూపడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. దాదాపుగా తెగదెంపులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

Recommended Video

Union Budget 2018 : బీజేపీతో టీడీపీ పొత్తు..ఇంటికి రాదు విత్తు

కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చంద్రబాబు చెబుతూ వచ్చారు. అయితే అలా జరగడం లేదని కేంద్ర బడ్జెట్ తీరు తెలియజేస్తోంది. కావాలనే మోడీ ప్రభుత్వం చంద్రబాబును కార్నర్ చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబుపైనే విపక్షం దాడి

చంద్రబాబుపైనే విపక్షం దాడి


రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని విమర్సల దాడి ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వంపై సన్నాయి నొక్కులు నొక్కుతూ ప్రధానంగా చంద్రబాబుపై విమర్శలు చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, పార్థసారథి వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆ విషయం తెలిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని పార్థసారథి ప్రశ్నించారు.
కేవలం వట్టి మాటలతో ఇన్నాళ్లు చంద్రబాబు ప్రభుత్వం కాలాయాపన చేసిందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

కేంద్రంపై మండిపడుతున్న టిడిపి ఎంపీలు

కేంద్రంపై మండిపడుతున్న టిడిపి ఎంపీలు

బడ్జెట్ విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టిడిపి పార్లమెంటు సభ్యులు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, ఇతర నేతలు బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎంపీ రాయపాటి సాంబశివ రావు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పార్టీ పార్లమెంటు సభ్యులే తీవ్రంగా ధ్వజమెత్తుతుంటే తాను ఏం చేయాలనేది చంద్రబాబుకు అంతు చిక్కడం లేదంటున్నారు.

టిజి వెంకటేష్ మాత్రం చంద్రబాబుపై..

టిజి వెంకటేష్ మాత్రం చంద్రబాబుపై..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. చంద్రబాబు ఎక్కడైనా చక్రం తిప్పగల నాయకుడు అన్నారు. ఆయన దేశాన్ని నడిపిన రోజులు ఉన్నాయన్నారు.ఇప్పటి వరకు ప్రేమతో రాబట్టాల్సింది అంతా రాబట్టామని చెప్పారు. సానుకూల ధోరణితో కేంద్రం నుంచి నిధులు సాధించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే చివరకి మనకు మిగిలేది చిప్పేనని అన్నారు.

అంచెలవారీ పోరాటమని...

అంచెలవారీ పోరాటమని...

ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం కోసం పార్లమెంటు లోపలా, వెలుపలా పోరాటం చేస్తామని టీజీ వెంకటేష్ చెప్పారు. కానీ కేంద్రంపై పోరు మాత్రం ఏమాత్రం సరికాదని చెప్పారు. అంచెలంచెలుగా కేంద్రంపై పోరాటం చేసి అన్నీ సాధించే ప్రయత్నం చేస్తామని అభిప్రాయపడ్డారు. చివరి ప్రక్రియగా మాత్రమే తెగదెంపులు ఉంటుందని టీజీ వెంకటేష్ చెప్పారు. కేంద్రంతో తెగదెంపులు తమ పార్టీ (తెలుగుదేశం) తెగదెంపులు చేసుకుంటే లబ్ధి పొందాలని ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు.

వైసిపిపై ఎక్కుపెట్టిన టీజీ వెంకటేష్

వైసిపిపై ఎక్కుపెట్టిన టీజీ వెంకటేష్


బీజేపీతో టిడిపి తెగదెంపులు చేసుకుంటే లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని టీజీ వెంకటేష్ ఆరోపించారు. కేంద్రంపై తొలి వార్‌గా టీడీపీ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని చెప్పారు. రెండో వార్‌గా ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. అంచెలంచెలుగా పోరాటాన్ని చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు.

రాజీనామాకు సిద్ధమని రాయపాటి

రాజీనామాకు సిద్ధమని రాయపాటి

బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్ధమని రాయపాటి సాంబశివ రావు సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేదని రాయపాటి అన్నారు. కానీ బీజేపీలో మాత్రం ఆరెస్సెస్ ఏదీ చెబితే అదేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీని ఇబ్బంది పెట్టి ఏపీలో పైకి రావాలని బీజేపీ కోరుకుంటోందని రాయపాటి అన్నారు.

బిజెపిపై మోదుగుల మండిపాటు

బిజెపిపై మోదుగుల మండిపాటు

బీజేపీ ఏపీని విస్మరించి క్షమించరాని తప్పు చేస్తోందని టిడిపి నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో వెంటనే మార్పులు చేసి ఏపీకి కేటాయింపులు పెంచాలన్నారు. ఈ సమయంలో ఎంపీగా లేనందున తనకు చాలా బాధగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాడు పార్లమెంటు తలుపులు మూసేసి అన్యాయం చేస్తే బీజేపీ తలుపులు తీసి అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల హామీలపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

చివరకు కాంగ్రెసు చేతికి ఆయుధం

చివరకు కాంగ్రెసు చేతికి ఆయుధం


తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన విమర్శలు చేయడానికి కేంద్ర బడ్జెట్ కాంగ్రెసు పార్టీకి ఆయుధంగా లభించిందని అంటున్నారు. ఏపీకి న్యాయం జరగాలంటే రాజీనామా చేసి రావాలని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి టిడిపికి సూచించారు. రాజీనామా చేసి వస్తే కలిసి ఏపీకి న్యాయం జరిగేలా ఉద్యమిద్దామని రఘువీరారెడ్డి కోరారు. లోక్ సభలో 25 ఎంపీలు ఈ రాష్ట్రానికి ఉన్నారు. వారంతా వెనువెంటనే రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రానికి ఆలస్యమైనా వెంటనే న్యాయం జరగాలంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. అందరం కలసి ఉద్యమిద్దాం. మాకెటువంటి భేషజాలు లేవు. చట్టప్రకారం, పార్లమెంటులో ఇచ్చినటువంటి హామీలు అమలుకావాల్సిందే"నని అని రఘువీరా అన్నారు.

కెవిపి అవకాశం తీసుకున్నారు...

కెవిపి అవకాశం తీసుకున్నారు...


బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు శుక్రవారం రాజ్యసభలో నిరసన తెలిపారు. హామీలు విస్మరిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కేవీపీ ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీకి సాధారణ బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం చేశారని ఆయన నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ వైస్ చైర్మన్ పదేపదే ఆయనను కూర్చోమని చెప్పాల్సి వచ్చింది. కేవీపీ తీరుపై కురియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెల్ నుంచి వెళ్లిపోవాలని పదేపదే చెప్పారు. విపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో రాజ్యసభ వాయిదా పడింది.

ఇక చంద్రబాబు ఏం చేస్తారు...

ఇక చంద్రబాబు ఏం చేస్తారు...


ప్రతిపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్న స్థితిలో చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వద్దంటే నమస్కారం పెట్టి దూరం జరుగుతామని చంద్రబాబు బిజెపికి హెచ్చరిక చేసి ఎన్నో రోజులు కాలేదు. అలా నమస్కారం పెట్టాల్సిన పరిస్థితిని బిజెపి కావాలనే బడ్జెట్‌లో ఎపికి మొండిచేయి చూపడం ద్వారా కల్పించిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

English summary
Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu was in fix, as the union budget ignored the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X