యూపీలో గెలుపు!: రాజ్యసభ సహా.. బీజేపీకి లాభాలివే, అతిపెద్ద విక్టరీ

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తోంది. 403 అసెంబ్లీ స్థానాలు గల యూపీలో మేజిక్ ఫిగర్ 202. బీజేపీ రెండు వందల స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ, బీఎస్పీలు బీజేపీని ఎదుర్కోలేకపోయాయి.

వాహ్! మోడీ మోదం: కమలం వెలిగిపోతోంది..(కార్టూన్)

బీజేపీకి ప్రస్తుతం లోకసభలో బలం ఉంది. రాజ్యసభలో మాత్రం లేదు. ఎగువ సభలో కమలం పార్టీ బలం పెంచుకునేందుకు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలవడం అవసరం. ఇప్పుడు అదే కనిపిస్తోంది. యూపీలో గెలుపు బీజేపీకి ఎన్నో రకాలుగా లాభం.

మోడీ ప్రభావం

మోడీ ప్రభావం

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ద్వారా మోడీ హవా తగ్గలేదని బీజేపీ చెప్పుకునేందుకు వీలు ఉంటుంది. మరో రెండేళ్లలో లోకసభ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి 2019 దాకా యూపీ గెలుపు బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే, తదుపరి జరిగే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకునేందుకు అవకాశముంటుంది.

అసంతృప్తులకు చెక్

అసంతృప్తులకు చెక్

గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీలో ఎంతోకొంత అసంతృప్తి కనిపించింది. ఇప్పుడు యూపీలో కూడా ఓడిపోతే మోడీ-అమిత్ షాల జోడీకి బీజేపీలోనే అసంతృప్తుల సెగ తప్పకుండా తగిలేదు. ఈ గెలుపుతో అసంతృప్తుల ప్రభావం కనిపించకుండా పోయే అవకాశముంది.

2019కి సెమీ ఫైనల్స్

2019కి సెమీ ఫైనల్స్

ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు 2019కి సెమీ ఫైనల్స్. యూపీతో గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలోను ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడవుతున్నాయి. అన్ని రాష్ట్రాల కంటే యూపీనే కీలకం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. యూపీలో ఎవరు గెలిస్తే 2019కి జరగనున్న సెమీ ఫైనల్స్‌కు వారు రేసులో ముందంజలో ఉన్నట్లుగా భావించవచ్చు.

రాజ్యసభలో సీట్లు పెరుగుతాయి

రాజ్యసభలో సీట్లు పెరుగుతాయి

ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తే రాజ్యసభలో బీజేపీకి సీట్లు పెరుగుతాయి. ఇలాగే దూసుకెళ్తే 2019 నాటికి పెద్దల సభలో బీజేపీ కాంగ్రెస్ పార్టీని దాటి వేస్తుంది. అందుకు ఈ యూపీ ఎన్నికలే ప్రారంభం.

కళ్యాణ్ సింగ్ తర్వాత..

కళ్యాణ్ సింగ్ తర్వాత..

ఉత్తర ప్రదేశ్‌లో మేజిక్ ఫిగర్ 201 అయినప్పటికీ.. బీజేపీ 250 స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీజేపీకి ఈ రాష్ట్రంలో అతిపెద్ద విజయం. కళ్యాణ్ సింగ్ హయాంలో బీజేపీ 221 స్థానాలు గెలుచుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
UP will get more Rajya Sabha seats for BJP as they are wining very big.
Please Wait while comments are loading...