కెసిఆర్‌కు కలిసొచ్చిన విద్యాసాగర్‌రావు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ, మహారాష్ట్రల మధ్య తలపెట్టిన అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై ఇరురాష్ర్టాల మధ్య అవగాహన కుదరడానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యాసాగర్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉండటంతో తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర నీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందాలు కుదుర్చుకోవడం సులభతరమైనట్లు కనిపిస్తోంది.
నీటి ప్రాజెక్టుల కీలక ఒప్పందాల విషయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వారధిగా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరస్పర సహకారంతో సాగు, తాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో ఇద్దరు సీఎంలు మంగళవారం సమావేశమైన విషయం తెలిసిందే.

విద్యాసాగర్ రావుతో భేటీ
తెలంగాణ, మహారాష్ట్రల మధ్య తలపెట్టిన అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై ఇరురాష్ర్టాల మధ్య అవగాహన కుదరడానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కీలకంగా మారినట్లు తెలుస్తోంది.

పుస్ఫగుచ్ఛం ఇస్తూ..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యాసాగర్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉండటంతో తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర నీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందాలు కుదుర్చుకోవడం సులభతరమైనట్లు కనిపిస్తోంది.

చర్చ
నీటి ప్రాజెక్టుల కీలక ఒప్పందాల విషయంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వారధిగా నిలిచినట్లు తెలుస్తోంది.

చర్చ
విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం కెసిఆర్, ఫడ్నవీస్‌తో సామరస్య పూర్వక వాతావరణంలో చర్చల జరిపి ఫలితాలు సాధించడానికి కారణమైందని భావిస్తున్నారు.

చర్చ
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఉద్యమంలో టిఆర్ఎస్ తో కలిసి బిజెపి పని చేయడానికి ఆయన సహకరించినట్లు చెప్తారు.
విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం కెసిఆర్, ఫడ్నవీస్‌తో సామరస్య పూర్వక వాతావరణంలో చర్చల జరిపి ఫలితాలు సాధించడానికి కారణమైందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఉద్యమంలో టిఆర్ఎస్ తో కలిసి బిజెపి పని చేయడానికి ఆయన సహకరించినట్లు చెప్తారు.
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రాజ్‌భవన్‌లో సిఎం కెసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక విందు ఇచ్చారు. కెసిఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే విద్యాసాగర్ రావు రాజ్‌భవన్ విందు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, పుట్టిన రోజునాడు సంబరాలకు పరిమితం కాకుండా రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి వరకు వచ్చారని ఫడ్నవిస్ ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications