విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్పీ ఆలోచనల నుంచి పద్మలతను తప్పించేందుకు! ఎవరా మహిళ?

విశాఖలో కలకలం రేపిన గేదెల రాజు, కాకర పద్మలత హత్యలపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాఫ్తు జరుపుతున్నారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: విశాఖలో కలకలం రేపిన గేదెల రాజు, కాకర పద్మలత హత్యలపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాఫ్తు జరుపుతున్నారు. గేదెల రాజు హత్య కేసు మిస్టరీ ఛేదించే క్రమంలో పద్మలత హత్య చుట్టు అల్లుకున్న అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే కూతురుతో సంబంధం, హత్యకు రూ.కోటి, రౌడీషీటర్ హత్య: ఈ డీఎస్పీ మామూలోడు కాదుమాజీ ఎమ్మెల్యే కూతురుతో సంబంధం, హత్యకు రూ.కోటి, రౌడీషీటర్ హత్య: ఈ డీఎస్పీ మామూలోడు కాదు

పద్మలత మరణం వెనుక ఎవరు ఉన్నారు? దాసరి రవిబాబుతో క్లోజ్‌గా ఉన్న పద్మలత హఠాత్తుగా ఆయనపై ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేశారు? అసలు ఏం జరిగింది? అనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

పోలీసులు ఇప్పటికే తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. కేసులో ఏ1 నిందితుడు డీఎస్పీ దాసరి రావిబాబు, ఏ2 నిందితుడు క్షత్రియభేరి ఎడిటర్ భూపతిరాజు శ్రీనివాసరాజు, ఏ6 నిందితుడు కారు డ్రైవర్ కేశవ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పద్మలత మరణానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా

పద్మలత మరణానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా

గేదెల రాజు హత్య కేసులో డీఎస్పీ రవిబాబు పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం పద్మలత కారణానికి కారణాలను కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పద్మలత కుటుంబ సభ్యులను, ఆమె సన్నిహితులను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

 తాయెత్తు కట్టిస్తే సరిపోతుందని

తాయెత్తు కట్టిస్తే సరిపోతుందని

దాసరి రవిబాబు.. పద్మలతలు సఖ్యతతో ఉన్న విషయం తెలిసిందే. కానీ పద్మలత తండ్రి ఎన్నికల్లో ఓడిపోయాక ఆమెను రవిబాబు దూరం పెట్టారు. ఈ క్రమంలో పద్మలత ఉన్నతాధికారులకు రవిబాబుపై ఫిర్యాదు చేశారు. అదే సమయంలో రవిబాబు ఆలోచనల నుంచి బయటపడేందుకు తన వద్ద ఓ మార్గం ఉందని, తాయెత్తు కట్టిస్తే సరిపోతుందని గేదెల రాజు ఏడాది క్రితం పద్మలత కుటుంబ సభ్యులను ఒప్పించి తీసుకు వెళ్లాడు. కానీ ఆ తర్వాత ఆమె శవమై తిరిగి వచ్చింది. అప్పట్లో అది ప్రమాదంగా అందరూ భావించారు.

 పోలీసులు తవ్వుతున్నారు

పోలీసులు తవ్వుతున్నారు

ఇప్పుడు రౌడీ షీటర్ గేదెల రాజు హత్య నేపథ్యంలో పద్మలతది ప్రమాదం కాదని, ఆమెది కూడా హత్యగా అనుమానించారు. పద్మలతను తప్పించేందుకు డీఎస్పీ రవిబాబు.. గేదెల రాజుతో రూ.కోటికి బేరం కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు.

 ఓ మహిళ ఇంటికి వెళ్లిన పద్మలత

ఓ మహిళ ఇంటికి వెళ్లిన పద్మలత

నాడు రవిబాబు - పద్మలతల మధ్య సమస్యను తేల్చేయడానికి గేదెల రాజుతో పాటు మరికొందరు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. చర్చల కోసం అప్పుడు ఓ మహిళ ఇంటికి వెళ్లారని చెబుతున్నారు. ఆ తర్వాత పద్మలత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రవిబాబు ఆమెను అంతమొందించాలనుకున్నాడు. పద్మలతపై స్లో పాయిజన్ జరిగిందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మిగతా డబ్బు కోసం గట్టిగా అడిగిన గేదెల రాజును కూడా రవిబాబు చంపించాడు.

English summary
Dasari Ravi Babu, a DSP-rank police officer, has been named the prime accused in the murder of rowdy-sheeter Kopperla Satyanarayana Raju alias Gedela Raju . The Vizag city police claimed to have solved the mystery behind the murder by nabbing nine accused in the case on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X