వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల: ఓట్ల చీలిక , రాయలసీమ సెంటిమెంట్, వైసీపీకి దెబ్బెనా?

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్‌పీఎస్ అభ్యర్థులు ఏ పార్టీ ఓట్లను చీల్తుతారోననే ఆందోళన ప్రధాన పార్టీల్లో నెలకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్‌పీఎస్ అభ్యర్థులు ఏ పార్టీ ఓట్లను చీల్తుతారోననే ఆందోళన ప్రధాన పార్టీల్లో నెలకొంది. ఈ అభ్యర్థులు చీల్లే ఓట్లు ఎవరికి ప్రయోజనం కల్గిస్తాయి, ఎవరికి నష్టం కల్గిస్తాయనే లెక్కలు వేసుకొంటున్నారు ప్రధాన పార్టీల కీలక నేతలు. టిడిపి, వైసీపీ అభ్యర్థుల గెలుపు ఓటములపై ఇతర పార్టీల అభ్యర్థులు చీల్చే ఓట్లు తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు.

శిల్పా ఎఫెక్ట్: దిద్దుబాటులో టిడిపి, 'ఉప ఎన్నిక వాయిదాకు కుట్ర'శిల్పా ఎఫెక్ట్: దిద్దుబాటులో టిడిపి, 'ఉప ఎన్నిక వాయిదాకు కుట్ర'

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికను టిడిపి, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం రెండు పార్టీలు శక్తియుక్తులను ధారపోస్తున్నాయి. వైసీపీ చీఫ్ జగన్ ఈ నెల 9వ, తేది నుండి నంద్యాలలోనే మకాం వేశారు.

బాబు తీరుతో అలిగాను, జగన్ వల్లే... ఎస్‌పివై సంచలనంబాబు తీరుతో అలిగాను, జగన్ వల్లే... ఎస్‌పివై సంచలనం

టిడిపి కూడ కీలక నేతలను నంద్యాలలో ప్రచారంలో రంగంలోకి దించింది. అయితే ఈ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్, రాయలసీమ ప్రజా సమితి పార్టీల అభ్యర్థులు ఏ పార్టీ కొంప ముంచుతారోననే ఆందోళన కూడ నెలకొంది.

గెలుపు ఓటములపై 'గోస్పాడు', భూమా ఫ్యామిలీకి కలిసి వచ్చేనా?, వైసీపీ ధీమా ఇదేగెలుపు ఓటములపై 'గోస్పాడు', భూమా ఫ్యామిలీకి కలిసి వచ్చేనా?, వైసీపీ ధీమా ఇదే

ఈ ఎన్నికల్లో అన్ని రకాల అస్త్రాలను ప్రధాన పార్టీల నేతలు ఉపయోగిస్తున్నారు. అయితే ఓటర్లు ఏ రకమైన అస్త్రాలకు ప్రసన్నం అవుతారోననే అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో అధికార విపక్ష పార్టీలు వ్యూహత్మకంగానే అడుగులు వేస్తున్నాయి.

రాయలసీమ సెంటిమెంట్ ఎవరికి దెబ్బ

రాయలసీమ సెంటిమెంట్ ఎవరికి దెబ్బ

సెంటిమెంట్ కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అయితే అదే సమయంలో నవ్యాంధ్రలో కోస్తాంధ్ర అభివృద్దికే పాలకులు మొగ్గు చూపుతున్నారు, రాయలసీమను విస్మరిస్తున్నారని కొందరు రాయలసీమ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై పాదయాత్రలు, ఆందోళనలను కూడ నిర్వహించారు. అయితే ఈ ప్రచారాన్ని అధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే టిడిపిని వీడిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ ప్రజా సమితిని ఏర్పాటుచేసుకొన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఆయన రాయలసీమ పరిరక్షణ సమితి తరపున అభ్యర్థిని బరిలోకి దింపారు. అయితే ఈ అభ్యర్థికి ఓటుచేసేవారు అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగానే ఓటు చేస్తారు.అంటే ఈ ఓట్లు వైసీపీకి కలిసివచ్చేవి. అయితే ఈ పార్టీ అభ్యర్థి ఎన్ని ఓట్లు చీల్చితే అధికార పార్టీకి అంత ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

Recommended Video

Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
కాంగ్రెస్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది

కాంగ్రెస్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది

నంద్యాల అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ ఖాదర్‌ను బరిలోకి దింపింది.2014లో కాంగ్రెస్ పార్టీకి 2,459 ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్ర విభజన ప్రభావం కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా కన్పించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రభావం కొంత తగ్గి ఉండవచ్చనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని 1.35 లక్షల ఓట్లలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన 45 వేల ఓట్లున్నాయి. ఈ ఓట్లను ఎవరు చీల్చుతారోననే ఆందోళన నెలకొంది. బిజెపితో .పొత్తు టిడిపికి కొంత ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లను రాబట్టడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.అయితే అదే సమయంలో అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాలను తమకు ఓట్లను తెచ్చిపెడుతోందని టిడిపి భావిస్తోంది. అదే సమయంలో నామినేటేడ్ పదవులను మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకు టిడిపి కట్టబెట్టింది. పట్టణంలోని ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన నేతలను తమ వైపుకు ఆకర్షించింది టిడిపి.

ప్రత్యేక హోదా అంశం ప్రభావం చూపే అవకాశం

ప్రత్యేక హోదా అంశం ప్రభావం చూపే అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం అనేది సెంటిమెంట్ బలంగా ఉంది. అయితే ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీని తీసుకోవడంపై విపక్షాలు అధికార పార్టీపై విరుచుకుపడ్డారు.ఈ విషయమై వైసీపీ చీఫ్ జగన్, కాంగ్రెస్ పార్టీ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఆందోళనలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ కూడ ద్వంద్వ నీతిని అవలంభిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

పార్టీలు మారినా అభ్యర్థులు మాత్రం ఆ కుటుంబాల నుండే

పార్టీలు మారినా అభ్యర్థులు మాత్రం ఆ కుటుంబాల నుండే

2014 లో ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి బరిలో నిలిచాడు. టిడిపి అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి పోటీచేశారు. ఆనాడు 2,42,742 ఓట్లుంటే, 1,72,999 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డికి 82,194 ఓట్లు వచ్చాయి,. టిడిపి అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 78,598 ఓట్లు వచ్చాయి. ఎస్‌డిపిఐ అభ్యర్థి హబీబుల్లాకు 6,091 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి, టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మనందరెడ్డి బరిలో నిలిచారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో షేక్ మహమ్మద్ బాషా, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నుండి గాజుల అబ్దుల్ సత్తార్‌లు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి అబ్దుల్ ఖాదర్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు ముస్లిం ఓటర్లను ఏ మేరకు చీల్చుతారనే ఆందోళన ప్రధాన పార్టీల్లో నెలకొంది. వీరు చీల్లే ఓట్లు ఏ పార్టీని తీవ్రంగా నష్టపర్చుతాయోననే ఆందోళన కూడ నెలకొంది.

English summary
Tdp, ysrcp Planning to win Nandyal by poll. there is a fear from RPS , congress to Tdp and ysrcrp candidates .Who will be votes loses from Rps, congress party candidates. these candidates get votes will be change to final result Nandyal by poll said analysts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X