జయబచ్చన్ ఆస్తులు రూ.వేయి కోట్లు: వాచీలే కోట్లు, పెన్నులు...

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రముఖ నటి, సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు జయా బచ్చన్ పార్లమెంటు సభ్యులందరిలోకి అత్యంత ధనవంతురాలుగా నిలిచే అవకాశం ఉంది. ఆమె రూ.1,000 కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రకటించారు.

ఆస్తుల్లో ఆమె బిజెపి రాజ్యసభ ఎంపీ రవీంద్ర కిశోర్ సిన్హాను అధిగమించారు. ఆయన ఆస్తుల విలువ 2014 లెక్కల ప్రకారం రూ.800 కోట్లు ఉంటుంది. ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థిగా రాజ్యసభ బరిలోకి దిగారు.

రెండింతలు పెరిగిన ఆస్తులు

రెండింతలు పెరిగిన ఆస్తులు

రాజ్యసభకు నామినేషన్ వేసిన జయా బచ్చన్ తన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు ఇచ్చారు. ఆమె చర, స్థిరాస్తుల విలు రూ.493 కోట్లు ఉంటాయి. 2012లో ఆమె పోటీ చేసినప్పుడు 2012లో ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె, ఆమె భర్త అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ రెండింతలు పెరిగింది.

  Jaya Bachchan Could Be Mamata Banerjee’s Choice
  ఆస్తులు ఇలా ఉన్నాయి...

  ఆస్తులు ఇలా ఉన్నాయి...

  అఫిడవిట్ ప్రకారం - జయా బచ్చన్ (69)కు తన భర్త ఆస్తులతో కలిపి ఉన్న స్థిరాస్తుల విలువ రూ.460 కోట్లు కాగా చరాస్తుల విలువ రూ.540 కోట్లు. 2012లో వారి ఆస్తుల విలువను రూ.343 కోట్లుగా ప్రకటించారు.

  ఆస్తుల విలువలు ఇలా..

  ఆస్తుల విలువలు ఇలా..

  చరాస్తుల్లో జయా బచ్చన్‌కు రూ.9 లక్షల విలువ చేసే కలం, రూ.51 లక్షల విలువ చేసే గడియారాలు ఉన్నాయి. అమితాబచ్చన్ చరాస్తుల విలువతో పోలిస్తే ఇది చాలా తక్కువ.. అమితాబ్ బచ్చన్ వద్ద రూ.3.4 కోట్ల విలువ చేసే గడియారాలు ఉన్నాయి.

  వారికున్న భూములు...

  వారికున్న భూములు...

  బచ్చన్ దంపతులకు ఫ్రాన్స్‌లోని బ్రిగ్నోగాన్ ప్లేగ్స్‌లో 3,175 చదరవు మీటర్ల నివాసిత ఆస్తి ఉంది. దానికి తోడు భోపాల్, నోయిడా, ఢిల్లీ, పూణే,ముంబై, గాంధీనగర్, అహ్మదాబాదుల్లో ఆస్తులున్నాయి. అమితాబచ్చన్‌కు బారాబంకి జిల్లాలోని దౌల్తాపూర్‌లో ఓ ప్లాట్ ఉంది. దాని విలువ రూ.5.7 కోట్లు. జయాబచ్చన్‌కు లక్నోలోని కాకోరీ ప్రాతంలో 1.22 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. దాని విలువ రూ.2.2 కోట్లు ఉంటుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jaya Bachchan, Samajwadi Party (SP) lawmaker from Uttar Pradesh could be the country’s richest Minister of Parliament (MP).

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి