వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మొహాలి: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వీర విహారంతో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుతమైన విజయం సాధించింది. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే... అద్భుతైమైన విక్టరీతో భారత సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇదంతా విరాట్‌ కోహ్లీ వీరోచితంగా ఆడటం వల్లే.

టీమిండియా సెమీస్ బరిలో నిలవాలంటే 18 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి ఉంది. అంటే ఓవర్‌కు 13 పరుగులు చొప్పున చేయాలి. ఎలాంటి జట్టుకైనా ఇది కఠిన సవాలే. ఆఖరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల సామర్ధ్యమున్న ఆస్ట్రేలియా ప్రత్యర్ధి జట్టుగా ఉంది.

కానీ టీమిండియా... ఆస్ట్రేలియా జట్టుపై స్వైరవిహారం చేసిన విరాట్ కోహ్లీ ఆ జట్టుని పసికూనగా మార్చేశాడు. చివరి మూడు ఓవర్లలో భాగంగా 18వ ఓవర్‌ను ఆసీస్ బౌలర్ ఫల్కనర్ వేశాడు. ఈ ఓవర్‌లో కోహ్లీ వరుసగా 4, 4, 4 6, 2తో భారత్ లక్ష్యాన్ని తేలిక చేసేశాడు.

ఫోటో గ్యాలరి: వరల్డ్ T20

తొలి రెండు ఓవర్లలో 12 పరుగులే ఇచ్చిన ఫల్కనర్ తన మూడు ఓవర్లు ముగిసే సరికే 31 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే చివరి 2 ఓవర్లలో భారత్ 20 పరుగులు చేయాల్సి ఉంది. ఆ తర్వాత 19 ఓవర్‌ను కౌల్టర్ నైల్ వేశాడు. ఈ ఓవర్‌లో కోహ్లీ ఏకంగా నాలుగు ఫోర్లు బాదాడు.

దీంతో 19 ఓవర్లు ముగిసి సరికే టీమిండియా విజయ లక్ష్యంగా 4 పరుగులకు చేరింది. 20 ఓవర్‌లో తొలి బంతికే కెప్టన్ ధోని విన్నింగ్ షాట్ కోట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. 17 ఓవర్ల వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ 18,19 ఓవర్లలో భారత్ వైపు తిరిగింది. అయితే భారత్ ఇంత తేలిగ్గా ఈ మ్యాచ్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.

కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును సెమీస్ లోకి చేర్చి, వరల్డ్ కప్‌పై ఆశలు సజీవంగా ఉంచాడు. చివరి మూడు ఓవర్లలో విరాట్ కోహ్లీ, బౌలర్ ఎవరైనా సరే... ఎంత మంచి బంతి వేసినా అంతే అందంగా, బలంగా బాదాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఛేదనలో కోహ్లీని మించిన మొనగాడు లేడని అంటున్నారు.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

ఐసీసీ వరల్డ్ టి20‌లో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి, భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 160 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా టీమిండియా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

ఫైనల్‌లో స్థానం కోసం వెస్టిండీస్‌తో భారత్ తలపడుతుంది. మరో సెమీ ఫైనల్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, ఆరోన్ ఫించ్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. అయితే, తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించిన తర్వాత ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో ధోనీ చక్కటి క్యాచ్ అందుకోగా ఖాజా పెవిలియన్ చేరడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

ఖాజా 16 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లతో 26 పరుగులు సాధించాడు. తర్వాత కొద్ది సేపటికే ఫస్ట్‌డౌన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా వెనుదిరిగాడు. అతను కేవలం ఆరు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, ధోనీ స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు. రెండు పరుగులు చేసిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను ధోనీ క్యాచ్ పట్టగా యువరాజ్ సింగ్ వెనక్కు పంపాడు.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

74 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం ఆరోన్ ఫించ్, గ్లేన్ మాక్స్‌వెల్ కలిసి స్కోరును వంద పరుగుల మైలురాయికి చేర్చారు. అదే సమయంలో హార్దిక్ పాండ్య వేసిన బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమైన ఫించ్ పొరపాటుగా షాట్ కొట్టి మిడ్ వికెట్ స్థానంలో కాపుకాసిన శిఖర్ ధావన్‌కు దొరికాడు.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

అతను 34 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగులు సాధించాడు. ఐదో వికెట్‌కు గ్లేన్ మాక్స్‌వెల్, షేన్ వాట్సన్ కలిసి 30 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వేగంగా పరుగులు తీస్తూ, బలపడుతున్నట్టు కనిపిస్తున్న మాక్స్‌వెల్‌ను జస్‌ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

మాక్స్‌వెల్ 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. పది బంతుల్లో పది పరుగులు చేసిన జేమ్స్ ఫాల్క్‌నెర్ లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించి, హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. చివరిదైన అదే ఓవర్‌లో వాట్సన్ (18 నాటౌట్) ఒక ఫోర్, పీటర్ నెవిల్ (రెండు బంతుల్లో 10) ఒక ఫోర్, మరో సిక్సర్ బాదారు. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 160 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించగలిగింది.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

సెమీస్‌లో అడుగుపెట్టడానికి 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మతో కలిసి ఆరంభించిన శిఖర్ ధావన్ వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేశాడు. అయితే, 12 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 13 పరుగులు చేసిన అతను నాథన్ కౌల్టన్ నైల్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో తొలి వికెట్ కూలింది.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

కొద్ది సేపటికే మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా వెనుదిరిగాడు. 12 పరుగులు చేసిన అతనిని షేన్ వాట్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. టి-20 స్పెషలిస్టు సురేష్ రైనా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. పది పరుగులు చేసిన అతను షేన్ వాట్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పీటర్ నెవిల్‌కు చిక్కాడు. 49 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ చేజార్చుకుంది.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

కోహ్లీతో కలిసి నాలుగో వికెట్‌కు 6.2 ఓవర్లలో 45 పరుగులు జోడించిన యువరాజ్ సింగ్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జేమ్స్ ఫాల్క్‌నెర్ బౌలింగ్‌లో వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రన్‌రేట్ పెరుగుతున్నప్పటికీ, వ్యూహాత్మకంగా ఆడిన కోహ్లీ భారత్‌ను ఆదుకున్నాడు. అతను 39వ బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

తర్వాత ఫాల్క్‌నెర్ వేసిన ఓవర్‌లో కోహ్లీ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా, భారత్‌కు మొత్తం 19 పరుగులు లభించాయి.దీనితో చివరి రెండు ఓవర్లలో విజయానికి టీమిండియా 20 పరుగుల దూరంలో నిలిచింది. నాథన్ కౌల్టర్ నైల్ వేసిన 19 ఓవర్‌లో కోహ్లీ నాలుగు ఫోర్లు కొట్టాడు.

 18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా

చివరి ఓవర్‌లో విజయం సాధించేందుకు భారత్‌కు కేవలం నాలుగు పరుగులు అవసరమయ్యాయి. ఫాల్క్‌నెర్ వేసిన చివరి ఓవర్ మొదటి బంతిని ధోనీ బౌండరీగా మలచి, మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే భారత్‌కు కీలక విజయాన్ని అందించాడు. 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు టీమిండియా 161 పరుగులు చేసింది. అప్పటికి కోహ్లీ 82 (51 బంతులు, 9 ఫోర్లు, రెండు సిక్సర్లు), ధోనీ 18 (10 బంతులు, 3 ఫోర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

English summary
India made their third semifinal in the T20 World Cup as they beat Australia by wickets at the PCA IS Bindra Stadium here on Sunday (March 27).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X