చేతులెత్తేసిన లక్ష్మీపార్వతి, జగన్‌కు దొరికిన చంద్రబాబు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు బెజవాడలో జరిగిన వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు వేసుకున్న మార్కులతోనే ఆయనకే కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించినందుకు రాష్ట్రంలో వివిధ శాఖలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేటింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రేటింగ్స్‌లో టూరిజం శాఖకు జీరో రేటింగ్ రావడం విశేషం. ఇంతకీ ఈ టూరిజం శాఖను స్వయంగా సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ... సున్నా మార్కుల బాబు డబ్బులతో గెలవలేరని విమర్శించారు. ప్రజా వ్యతిరేకిత ఉన్నప్పుడు డబ్బులు పని చేయవని చెప్పారు. 2004కు ముందు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న నీకు 2004 ఎన్నికల్లో 46 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు.
వరుసగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్న తరుణంలో జగన్... చంద్రబాబుకు ధీటుగా ముందుకు వస్తున్నారు. పదేపదే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపిస్తున్నారు. తద్వారా చంద్రబాబును దోషిగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో హామీలు, ప్రత్యేక హోదా, ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన హామీల విషయంలో చంద్రబాబును ప్రశ్నిస్తూనే, గత మూడు నాలుగు నెలలుగా ఎమ్మెల్యేలను కొంటున్నారని చెబుతూ చంద్రబాబును టార్గెట్ చేసుకుంటున్నారు.
కాగా, వైసిపి నేత లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబుతో పోరాటం తన వల్ల కాలేదని, ఆయనకు సరైన మొగుడు జగనేనని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అందరిలోను ఆసక్తిని రేపాయి.

జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బెజవాడలో వైసిపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ సహా వైసిపి నేతలు చంద్రబాబుపై మండిపడ్డారు.

జగన్
చంద్రబాబు తాను ఇచ్చిన ఏ హామీని ఇప్పటి దాకా నెరవేర్చలేదని జగన్ దుమ్మెత్తిపోశారు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు తినని గడ్డి లేదన్నారు. అబద్దపు హామీలు ఇచ్చారన్నారు.

జగన్
చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని, వారికి రూ.600 కోట్లు ఇచ్చారని, ఆ మొత్తం ఏమైనా మీ అత్తగారి సొత్తా అని నిలదీశారు.

జగన్
ముద్రగడ పద్మనాభం దీక్షలో తప్పేముందని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని ఆయన దీక్ష చేస్తున్నారని చెప్పారు.

జగన్
ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా పైన ప్రధాని మోడీని, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల పైన కేసీఆర్‌ను మన సీఎం చంద్రబాబు నిలదీయలేరని ఎద్దేవా చేశారు. తన అవినీతిని కేంద్రం బట్టబయలు చేస్తుందని మోడీని, ఓటుకు నోటులో ఇరికిస్తారని కేసీఆర్‌ను నిలదీయడం లేదని జగన్ ఆరోపించారు.

జగన్
అబద్దాలు చెప్పే వ్యక్తి సినిమాల్లో కనిపిస్తే ఆ వ్యక్తి విలన్ అవుతాడని, విలన్ క్యారెక్టర్ వేసే రాజనాల వంటి వారిని చూస్తే చంద్రబాబు గుర్తుకు వస్తారన్నారు. సినిమాలో 14 రీళ్లు ఉంటాయని, అందులో పదమూడు రీళ్లలో విలన్‌దే పైచేయి అవుతుందని, 14వ రీల్‌కు వచ్చే వరకు హీరో తిరగబడతాడన్నారు. ప్రజలు తోడుగా నిలుస్తారని, దేవుడు ఆశీర్వదిస్తాడన్నారు.

జగన్
ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు చెప్పని అబద్దం లేదని వైసీపీ అధినేత వైయస్ జగన్ విజయవాడలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని జగన్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎక్కడ ఖాళీగా గోడలు కనపడినా ఆయన వాటిపై ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.

జగన్
'ఏ ప్రసంగం చేసినా రుణమాఫీ చేస్తాను అని మాట్లాడారు. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ అన్న అంశాన్నే చంద్రబాబు మర్చిపోయార'ని జగన్ విమర్శించారు. డ్వాక్రా మహిళలను సైతం ప్రభుత్వం మోసం చేసిందని జగన్ మండిపడ్డారు.

జగన్
చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రైతు రుణాలు రూ. 87 వేలు కోట్లు ఉండేవన్నారు. దీంతో లక్ష లోపు రుణం వడ్డీ లేకుండా, 3 లక్షల లోపు రుణం పావలా వడ్డీకే వచ్చేదన్నారు. అవి కట్టొద్దని చెప్పిన పాపానికి, ఈరోజు అపరాధ వడ్డీ కింద రైతులకు 14-18 శాతం వడ్డీ కడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 87 వేల కోట్ల రైతు రుణాల మీద వడ్డీ రూపేణా కేవలం 25వేల కోట్లు చెల్లించారని ధ్వజమెత్తారు.

జగన్
చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీల్లో మూడోవంతు కూడా సరిపోలేదని విమర్శించారు. కానీ అదే రుణమాఫీ అని, రైతులకు పూర్తిగా రుణమాఫీ అయిపోయిందని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తున్నారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలి ఇక చదువుకునే పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు.

జగన్
జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు రేపు పొద్దున్న ఉంటాయో లేవో తెలియని దుస్థితిలో కాంట్రాక్టు ఉద్యోగులున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రోజుకో ఉద్యోగం ఊడుతోంది. ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పటికే వెళ్లిపోయారన్న జగన్, గోపాలమిత్రలు ధర్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

జగన్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు వేల నిరుద్యోగ భృతి గురించి అడిగితే, చంద్రబాబు నేనెప్పుడు చెప్పానంటున్నాడని మండిపడ్డారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైసీపీ అందుబాటులో ఉంటుందని జగన్ ఈ సందర్భంగా అన్నారు. 'గడచిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకి కోటి ముప్పై ఐదు లక్షల ఓట్లు వస్తే, మనకి కోటి ముప్పై లక్షల ఓట్లు వచ్చాయి.. కేవలం ఐదు లక్షల ఓట్లే తేడా' అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications