Tech News:అధ్యాపకులకు బ్లాక్‌చైన్ టెక్నాలజీపై శిక్షణ..!

హైదరాబాద్ : టెక్నాలజీ రంగంలో భారత్ దూసుకెళుతోంది. ఏటా ఎంతో మంది ఇంజినీర్లు తయారవుతున్నారు. ఇక ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అప్‌డేట్ చేసుకుంటూ యువత తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచ వేదికలపై సత్తా చాటుతోంది. అంతేకాదు ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను కూడా ఆ మేరకు సాన పెడుతున్నారు. అయితే విద్యార్థులకు మరింత అప్‌డేటెడ్ టెక్నాలజీ అందించాలన్న ఉద్దేశంతో కళాశాలలు ముందుగా అధ్యాపకులకు పలు కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు సరికొత్త టెక్నాలజీని తెలుసుకునేందుకు యాజమాన్యాలు కూడా తమ వంతు కృషి చేస్తూ అవగాహన కార్యక్రమాలు తమ క్యాంపస్‌లలోనే నిర్వహిస్తున్నాయి. ఇలాంటి ఒక టెక్నో ఈవెంట్ హైదరాబాద్‌ కీసరలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించారు.

కీసర మండలం రాంపల్లి దాయర గ్రామ పంచాయితీ పరిధిలో నవంబర్ 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు AICTE-ATAL
వారి సహకారంతో బ్లాక్‌చైన్‌టెక్నాలజీపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ విజయవంతంగా జరిగింది. బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. ఒక బిజినెస్ నెట్వర్క్‌లో పారదర్శకమైన సమాచారాన్ని లేదా డేటాను షేర్ చేసేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తారని, ఇదొక అడ్వాన్స్‌ డేటాబేస్ మెకానిజం అని కార్యక్రమంలో శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన నిపుణులు వివరించారు.

Professors of Gitanjali engineering college trained on block chain technology

ఇక ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉదయ్ కుమార్ సుసర్ల, కన్వీనర్ డాక్టర్ శ్రీలక్ష్మీ, కోఆర్డినేటర్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. కళాశాల ఛైర్మెన్ జి. రవీందర్ , ఇండియన్ బ్లాక్ చెయిన్ ఫోరమ్ సహ వ్యవస్థాపకులు పంకజ్ దివాస్, బిట్స్ హైదరాబాద్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న సుబ్రకాంత్ పాండా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని AICTE-ATAL రూ.3,50,000తో స్పాన్సర్ చేసింది.

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వివిధ కళాశాలల నుంచి AICTE-ATAL పోర్టల్ ద్వార రిజిస్టర్ చేసుకోబడ్డ ప్రొఫెసర్లకు, లెక్చరర్లకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఎలాంటి కీలక పాత్ర పోషిస్తోందో వివరించడం.NIT,IIIT బ్లాక్ చెయిన్ ప్లాట్‌ఫార్మ్స్‌పై పనిచేస్తున్న నిష్ణాతులచే శిక్షణ ఇప్పించడం జరిగిందని కళాశాల యాజమాన్యం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+