కరువుకు పాస్‌వర్డ్.. అనావృష్టికి కేరాఫ్ 'బాబు': రోజా ఫైరింగ్ కామెంట్స్
శ్రీకాళహస్తి : రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. శ్రీకాళహస్తి పర్యటన సందర్బంగా.. మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో చక్కెర కర్మాగారాలను మూయించేశాడని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. మన్నవరం ప్రాజెక్ట్ను సైతం చంద్రబాబు వేరే చోటుకు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారని మండిపడ్డారు. ఇంతవరకు రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించలేదని మండిపడ్డ రోజా.. చంద్రబాబు కరవుకు పాస్వర్డ్ అని, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications