ఇది కరెక్ట్ కాదు.. అభిమానానికి కూడా హద్దులు ఉండాల్సిందేనా !!
ఏదైనా కానీ.. ఎవరైనా కానీ హద్దు దాటితే తిప్పలు తప్పవు. ప్రస్తుత సమాజంలో సినిమాలు, రాజకీయాలపై జనం ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వారి జీవితాలు ఎలా ఉన్నా.. ఏమై పోతున్నా పర్లేదు కానీ సినిమా ఇండస్ట్రీ బాగుండాలి.. తమ నాయకుడు బాగుండాలి అనేలానే ప్రవర్తిస్తున్నారు. తమ అభిమాన హీరో కోసమో, రాజకీయ నాయకుడి కోసమే ఒకరిపై మరొకరు దుర్భాషలు ఆడుకుంటూ గోడవలకి దిగుతున్నారు. రాజకీయాల కారణంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, హత్యలు చేసుకున్న ఘటనలే ఇప్పటికే చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అంతకు మించిన విష సంస్కృతి సినిమా హీరో, హీరోయిన్స్ విషయంలో కూడా మళ్లీ మొదలవుతోంది.
ఒక వైపు సినిమా హీరోలంతా మేమే మేము బాగానే ఉంటాం అని బహిరంగంగానే చెప్పుకొని.. బాగానే ఉంటున్నారు. కానీ వారి అభిమానులే అభిమానాన్ని హద్దులు దాటి.. మీ కంటే మా హీరోనే ఎక్కువ.. మీ హీరో రికార్డ్స్ కంటే మా హీరో రికార్డ్స్ ఎక్కువ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఇదంతా వ వైపు అయితే మరోవైపు మాత్రం అభిమానుల అత్యుత్సాహం. తమ అభిమాన నటుడిని, నటిని చూడాలని, ఫోటోలు దిగాలని అనిపించడం సహజమే. కానీ అక్కడితే ఆగకుండా అభిమానం హద్దులు దాటి వారికి ఇబ్బందులు తెస్తే మాత్రం అది కరెక్ట్ కాదనే మాటే సర్వత్రా వినిపిస్తోంది.

ఇటీవల నటి నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు అందరికి తెలిసిందే. ఆ తర్వాత కొద్దీ రోజులకే సమంతకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అభిమానం పేరుతో ఫ్యాన్స్ నటీనటులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఫ్యాన్స్ తీరుతో అసహనం వ్యక్తం చేశాడు. మలేషియాలో జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ముగించి తమిళనాడుకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ను చూసేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.
భారీ జనసందోహం మధ్యలో విజయ్ తన కారులో ఎక్కేందుకు వెళుతుండగా అభిమానుల తోపులాట మధ్య విజయ్ కాలుజారి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విజయ్ ను చుట్టుముట్టి సురక్షితంగా మళ్ళీ కారు ఎక్కించారు. ఈ ఘటనలో విజయ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఇందుకు ప్రధాన కారణంగా క్రౌడ్ కంట్రోల్ లేకపోవడమేనని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఈ తరహా వరుస ఘటనలతో అభిమానానికి కూడా హద్దులు ఉండాల్సిందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సైతం పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన రచ్చ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వేదిక ఏదైనా కానీ ఆయన పేరు ఎత్తడం ఆలస్యం.. హోరెత్తిపోయేలా రీ సౌండ్ ఇచ్చే వాళ్లు. పవన్ సైతం స్వయంగా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అందుకే అభిమానులు ఇప్పటికైనా కొంచెం హద్దుల్లో ఉండాలని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
'పెద్ది' స్థానంలో విజయ్ 'జన నాయగన్'.. ఇదేం ట్విస్ట్ సామీ..! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
73 శాతం ఓట్లతో విజయ్ ప్రభంజనం.. లేటెస్ట్ సర్వే సంచలనం.. ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
విజయ్ కు బిగ్ షాక్.. తొలిరోజే ఎన్నికల ప్రచారం రద్దు..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications