Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..!
తమిళనాడులో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే వెలువడిన పలు సర్వేల్లో అధికార డీఎంకే కన్నా విపక్ష అన్నాడీఎంకే కూటమి ముందుందని తేలింది. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతూ అదృష్టం పరీక్షించుకుంటున్న హీరో విజయ్ (Vijay) పార్టీ టీవీకే ఏం చేయబోతుందన్న ఉత్కంఠ కూడా సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి.
ఓట్ వైబ్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో తమిళనాడులో ఓటరు నాడి ఎలా ఉందో తెలిసిపోయింది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటముల మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఈ ఒపీనియన్ పోల్ మరోసారి తేల్చేసింది. వీరిద్దరి మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరు ప్రభావం విజయ్ పైనా కచ్చితంగా ఉండబోతోందనేది ఈ సర్వే సారాంశం. దీంతో విజయ్ పార్టీ వ్యూహాలకు మరింత పదునుపెట్టాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

ఓట్ వైబ్ తాజా ఒపీనియన్ పోల్ ప్రకారం 234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి ఉన్న
డీఎంకే కూటమి 113-124 సీట్లు సాధిస్తుందని తేలింది. అలాగే విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 106-116 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక విజయ్ పార్టీ టీవీకేకు కేవలం 2-8 సీట్లు లభిస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఎన్నో ఆశలతో ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న విజయ్ పార్టీకి దారుణంగా ఎదురుదెబ్బ తప్పదని ఈ సర్వేలో వెల్లడైంది. ఇది దాదాపుగా 2019లో తొలిసారి ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన సాధించిన ఒక్క సీటును గుర్తుకుతెస్తోంది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది ఈ ఎన్నికలు డీఎంకే-అన్నాడీఎంకే మధ్య ముఖాముఖీ పోరు మాత్రమేనని కూడా తేల్చేశారు. దీంతో విజయ్ పార్టీ టీవీకేపై ఓటర్లు ఏమాత్రం ఆసక్తిగా లేరని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications