Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటున్న హీరో, టీవీకే అధినేత విజయ్ (vijay) ఇవాళ తన ఆస్తుల్ని వెల్లడించారు. పెరంబూర్ స్ధానం నుంచి పోటీ కోసం ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన విజయ్.. తనకు ఉన్న స్దిర, చరాస్తుల వివరాలను, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలను అందులో వెల్లడించారు. టీవీకే వ్యవస్థాపకుడిగా ఉన్న విజయ్.. ఈ ఎన్నికల్లో రెండు స్ధానాల్లో బరిలోకి దిగుతున్నారు.

పెరంబూర్ సీటు నుంచి పోటీ చేస్తున్న విజయ్ తనకు స్థిర,చరాస్తులు కలిపి మొత్తం రూ.520 కోట్ల విలువైనవి ఉన్నట్లు తన నామినేషన్ డిక్లరేషన్ లో వెల్లడించారు. ఇందులో స్ధిరాస్తులు రూ.115 కోట్లు కాగా.. చరాస్తులు రూ.405 కోట్లు ఉన్నాయి. అలాగే రూ.5.35 లక్షల విలువైన మారుతీ స్విఫ్ట్ కారు కూడా ఉందని అందులో తెలిపారు. అలాగే 67, 400 విలువైన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం కూడా ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఇళ్లు, స్థలాలు, బంగారం ఇలా పలు ఆస్తులు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో విజయ్ పేర్కొన్నారు.

TVK Chief Vijay Declares 520 Crore in Assets for Perambur Assembly Nomination-here is full details

విజయ్ అఫిడవిట్‌లో బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, వాహనాలు, ఇతర చరాస్తులతో సహా BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అలాగే గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ వివరాలు కూడా ఉన్నాయి. విజయ్ 2024-25లో రూ. 184.53 కోట్లు, 2023-24లో రూ. 105.69 కోట్లు, 2022-23లో రూ. 198.71 కోట్లు, 2021-22లో రూ. 237.46 కోట్లు, మరియు 2020-21లో రూ. 8.04 కోట్ల ఆదాయాన్ని నివేదించారు. అలాగే విజయ్ భార్య 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,13,520 ఆదాయాన్ని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+