ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !!
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శ్రీమతి సువర్ణలత 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయోభారంతో పాటు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, బెంగళూరులోని స్వగృహంలో సోమవారం ( మార్చి 30, 2026 ) ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం బెంగళూరులో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సన్నిహితులు, బంధువులు, సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
కాగా హుబ్లీలోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన ఆమె.. కష్టపడి నర్సింగ్ విద్యను పూర్తి చేశారు. అనంతరం ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చి నర్సుగా పనిచేశారు. కష్టాలను ఎదుర్కొంటూ కుటుంబాన్ని నిలబెట్టిన ధైర్యవంతురాలిగా ఆమెను పరిచయస్తులు గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాకుండా సువర్ణలత క్రైస్తవ మతానికి చెందినవారు కాగా, ప్రకాష్ రాజ్ తండ్రి మంజునాథ్ రాయ్ హిందూ మతానికి చెందినవారు. ఈ విధంగా భిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనంలో పెరిగిన Prakash Raj వ్యక్తిత్వంలో సహనశీలత, విభిన్న ఆలోచనలు ప్రతిఫలించాయని చెప్పొచ్చు.

మరోవైపు ప్రకాష్ రాజ్ సినీ ప్రయాణంలో, వ్యక్తిగత జీవితంలో ఆయన తల్లి ప్రభావం ఎంతో ఉందని ఆయన అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. కష్టాల్లోనూ ధైర్యంగా నిలబడడం, స్వతంత్రంగా ఆలోచించడం వంటి లక్షణాలు తల్లిదగ్గర నుంచే వచ్చాయని ఆయన చెప్పేవారు. సువర్ణలత మరణంపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో Pawan Kalyan కూడా స్పందిస్తూ... "ప్రఖ్యాత నటుడు ప్రకాష్ రాజ్ గారి తల్లి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ కష్టసమయంలో ప్రకాష్ రాజ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
ఇక Prakash Raj గురించి చెప్పాలంటే... ఆయన దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు అనేక భాషల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా విభిన్న పాత్రల్లో మెప్పించి సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ప్రశంసలు పొందారు. అంతే కాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు.
ప్రముఖ నటుడు శ్రీ @prakashraaj గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సువర్ణలత గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 30, 2026












Click it and Unblock the Notifications