రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి!

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, పేదల అవసరాలు తీరుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పేదలందరికీ సన్నబియ్యం అందించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ పథకం ఘనత పూర్తిగా ఆయనకే దక్కుతుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతున్నా సరే ప్రజలకు కడుపునిండా భోజనం పెట్టాలన్నదే తమ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో 86శాతం మంది జనాభాకు సన్నబియ్యం

ప్రతి ఏటా సన్నబియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి వివరించారు. ప్రజలు రోజూ తినే ఆహారాన్నే వారికి అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 86 శాతం మంది జనాభాకు ఈ సన్నబియ్యం అందుతున్నాయన్నారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లు స్ఫూర్తితోనే ఇది కొనసాగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Minister Uttam Kumar Reddy Highlights Direct Payments in 48hours Credited to Farmers accounts

ఇప్పటివరకు ఖాతాల్లోకి రూ.40,000 కోట్లు జమ

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఖాతాల్లోకి రూ.40,000 కోట్లు జమ చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు నేరుగా చేరుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం 3.39కోట్ల మంది సన్నబియ్యం లబ్ధిదారులు ఉన్నారని మంత్రి వెల్లడించారు.

కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా

రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదని, ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు పరిశీలించి కార్డులు జారీ చేస్తారని హామీ ఇచ్చారు. రేవంత్ సర్కార్ రేషన్ కార్డుదారులకు తీపికబురు అందించింది.

ప్రజలకు తీపికబురు

ఏప్రిల్ నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలల రేషన్ ఒకేసారి అందించేందుకు సిద్ధమైంది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ప్రజలు ఒకేసారి తమ నిత్యావసరాలను పొందవచ్చు. దీంతోపాటు, వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+