73 శాతం ఓట్లతో విజయ్ ప్రభంజనం.. లేటెస్ట్ సర్వే సంచలనం.. ??

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల పర్వం నడుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికార డీఎంకే పార్టీ మరోసారి గద్దెనెక్కాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే పార్టీ ఈసారి అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ దళపతి టీవీకే పార్టీ అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు విజయ్ చూట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే తేల్చి చెప్పిన విజయ్.. ఇటీవల 243 మంది అభ్యర్థులను ప్రకటించారు.

తమిళ స్టార్ హీరో విజయ్ కేవలం సినీ గ్లామర్‌ తో కాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తలకు పట్టం కడుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌ ను అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా టికెట్ కేటాయింపు ప్రక్రియలో ధనబలం, కుల సమీకరణాలు, కుటుంబ నేపథ్యం ప్రాధాన్యంగా ఉంటుంది. కానీ విజయ్ వీటిని భిన్నంగా వ్యవహరించారు. తనను నమ్మి తనకోసం ఏళ్లపాటు నిలబడ్డ వ్యక్తులకు ఆయన టికెట్ ఇచ్చి గొప్ప మనసు ప్రదర్శించారు.

ఇక విజయ్ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఈ సారి ఎన్నికల్లో విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అవి పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్.. ఇప్పటికే పెరంబూర్ లో విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎన్నికల అఫిడవిట్ లో విజయ్ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. మొత్తం రూ.603.20 కోట్ల విలువైన ఆస్తులు తన పేరిట ఉన్నట్లు విజయ్ పేర్కొన్నారు. అందులో రూ.404.58 కోట్ల విలువైన చరాస్తులు కాగా స్థిరాస్తుల విలువ సుమారు రూ.198.62 కోట్లుగా ఉంది.

Vijay TVK Eyes Power in Tamil Nadu polls but New Surveys Predict a Strong DMK Victory and a Return

ఇక విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఈసారి అధికారంలోకి రావడం తథ్యం అని పలు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం అధికార డీఎంకే మరోసారి క్లియర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చాయి. అయితే తాజాగా రిఫ్లెక్ట్ న్యూస్ తమిళ్ అనే సంస్థ జరిపిన సర్వేలో ఏకంగా 73 శాతం మంది విజయ్ కు జై కొట్టడం విశేషం. మొత్తం 5 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే అందులో దాదాపు 73 శాతం మంది విజయ్ కు ఓటేశారు. ప్రస్తుత సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కు కేవలం 12 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక ఏఐఏడీఎంకే పార్టీకి కేవలం 10 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఈ సర్వే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+