పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..
చిత్ర పరిశ్రమలో మరో కొత్త జంట పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలలో ఎన్నో జంటలు ప్రేమ నుంచి పెళ్లి వరకు తమ ప్రయాణాన్ని తీసుకెళ్లాయి. అయితే ఇప్పుడు కోలీవుడ్ లోని ఓ స్టార్ హీరో తనయుడు.. మలయాళ ముద్దుగుమ్మ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ముందు నుంచే మంచి బాండింగ్ ఉందని.. ఇక ఆ మూవీ తర్వాత బాగా క్లోజ్ అయ్యారని అంటున్నారు. గత కొంతకాలంగా ఈ జంట మధ్య ప్రేమాయణం సాగుతోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది.
ధృవ్ - అనుపమ..
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు, హీరో ధృవ్ విక్రమ్ తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. కాగా మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా యువతలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి మధ్య స్నేహం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. బైసన్ మూవీతో ఇంకా బాగా క్లోజ్ అయ్యారని అంటున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి కొన్ని ప్రైవేట్ వేడుకల్లో కూడా పాల్గొంటున్నారు.

అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఒకరి పోస్ట్‌లకు మరొకరు స్పందిస్తున్న తీరు.. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అలానే వీరి కుటుంబాల మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయని.. పెద్దల అంగీకారంతోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు ధ్రువ్ విక్రమ్ కానీ, అనుపమ పరమేశ్వరన్ కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే వీరు ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం అనుపమ తన కెరీర్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉండగా, ధ్రువ్ విక్రమ్ కూడా తన తదుపరి ప్రాజెక్టుల మీద దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వీరి వివాహ వార్త బయటకు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఇది నిజమైతే, సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇదొక 'క్యూట్ జోడీ' అవుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications