సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !!
ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది ప్రముఖ గాయని "జోనితా గాంధీ". తెలుగు, తమిళం, హిందీ సహా అనేక భాషల్లో పాటలు పాడి భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో ఫాలోవర్లు ఉండగా.. లైవ్ కాన్సర్ట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తోంది. అంతే కాకుండా జోనితా స్టేజ్ ప్రెజెన్స్, స్టైలిష్ లుక్ కూడా యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. తన మధురమైన స్వరంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈమె, ఇప్పుడు ఒక్కసారిగా గ్లామరస్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
జోనితా గాంధీ ఎవరు?
జోనితా గాంధీ ఢిల్లీలో జన్మించినప్పటికీ.. చిన్న వయసులోనే కెనడాకు వెళ్లి అక్కడే పెరిగింది. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, యూట్యూబ్‌లో కవర్ సాంగ్స్ పాడుతూ తన టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ వీడియోలకు వచ్చిన స్పందనతోనే సంగీతాన్ని కెరీర్‌గా ఎంచుకుంది. జోనితాకు అసలైన బ్రేక్ ఇచ్చింది Vishal-Shekhar. Shah Rukh Khan నటించిన Chennai Express టైటిల్ సాంగ్ ద్వారా ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అదే పాటలో S. P. Balasubrahmanyamతో కలిసి పాడటం ఆమెకు పెద్ద గుర్తింపును తీసుకొచ్చింది.

ఆ తర్వాత A. R. Rahman, Pritam, Amit Trivedi వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి పాడుతూ తన కెరీర్‌ను మరింత బలోపేతం చేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలో కూడా జోనితా తనదైన ముద్ర వేసింది. Anirudh Ravichanderతో కలిసి పాడిన Arabic Kuthu, Kaavaalaa పాటలు భారీ సెన్సేషన్ సృష్టించాయి. ఈ పాటలతో యువతలో ఆమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో Kick 2, Love Story, Sarkaru Vaari Paata వంటి చిత్రాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించింది.
ఐటమ్ సాంగ్‌తో సర్‌ప్రైజ్..
ఇప్పటివరకు సింగర్‌గా మాత్రమే గుర్తింపు పొందిన జోనితా, ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించింది. Adivi Sesh నటిస్తున్న Dacoit సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేసింది. గ్లామరస్ లుక్, ఎనర్జిటిక్ స్టెప్పులతో అందరినీ షాక్‌కు గురి చేసింది. మరి ఈ సాంగ్ తన కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని చెప్పొచ్చు. సింగర్‌గా ఇప్పటికే టాప్‌లో ఉన్న ఆమె, ఇప్పుడు పెర్ఫార్మర్‌గా కూడా బిజీ అవుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.












Click it and Unblock the Notifications