'ఆ నిర్ణయం వెనుక బాబు!.. దేశప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే'
మోడీ-చంద్రబాబుల జోడీ గురించి వెంకయ్య ఘనంగా చెప్పారు గానీ ప్రస్తుతం ఈ జోడీ దేశానికి బోడిగా మారిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ.. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులపై విమర్శల వర్షం కురిపించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. మోడీ-చంద్రబాబుల జోడీ గురించి వెంకయ్య ఘనంగా చెప్పారు గానీ ప్రస్తుతం ఈ జోడీ దేశానికి బోడిగా మారిందని ఎద్దేవా చేశారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో సామాన్యులంతా అల్లాడుతున్నారని, సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్పితే తగ్గే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన సలహాలున్నాయని చెప్పుకుంటున్న చంద్రబాబు తీరును తప్పుబట్టారు అంబటి. నోట్లను రద్దు చేయాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాసింది తానేనని చెప్పుకొచ్చిన చంద్రబాబు.. తీరా ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు.

నోట్ల రద్దు నిర్ణయం వెనుక చంద్రబాబు ప్రమేయం గనుక ఉండుంటే.. తక్షణం దేశ ప్రజలందరికీ ఆయన క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అసలు డబ్బు పంపిణీ జోలికి వెళ్లకుండా ఉండగలమని చంద్రబాబు ప్రకటించగలరా అని నిలదీశారు. నోట్ల రద్దుతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజలకు సాంత్వన చేకూర్చేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications