ఏపీకి గుడ్ న్యూస్: ప్యాకేజీ చట్టబద్దతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
వచ్చే వారం ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్దత బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశముంది.
న్యూఢిల్లీ/విజయవాడ : హోదా అంశం పక్కకుపోయి.. ప్యాకేజీతో టీడీపీ ప్రభుత్వం రాజీ పడ్డాక.. దానికైనా చట్టబద్దత దక్కుతుందో లేదో అన్న అనుమానం అందరిలోను మొదలైంది. అధికార పార్టీ సైతం దీని గురించి ఆందోళన చెందింది. అయితే ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేందుకు టీడీపీ ఎంపీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
ఇదే విషయమై తాజాగా కేంద్రమంత్రి సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వెల్లడించారు. కాగా, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన చట్టబద్దత బిల్లును ఇప్పటికే సంబంధిత శాఖల ఆమోదం కోసం పంపించింది కేంద్రం.

వచ్చే వారం ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్దత బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశముంది. ప్యాకేజీకి చట్టబద్దతపై కేంద్రం సానుకూలంగా ఉండడంతో.. దీనిపై నెలకొన్న ఆందోళనకు తెరపడినట్టయింది.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications