Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదీ కేసీఆర్: సన్నాసి అంటూ దులిపిన రేవంత్, బాబు పక్క రాష్ట్ర సీఎం అని వ్యాఖ్య

మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ను, తెరాసలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలను సన్నాసీ అంటూ పలుమార్లు వ్యాఖ్యానిస్తూ ఏకిపారేశారు. ఓ సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడను పక్క రాష్ట్ర సీఎం అన్నారు.

480 మందినే గుర్తించారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెరాస, కేసీఆర్ పన్నెండు వందల మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నప్పటికీ 480 మందిని మాత్రమే గుర్తించడం విడ్డూరమన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు నిమిషం ఆగకుండా మంత్రి పదవులు తీసుకున్నారని, కానీ తెలంగాణ కోసం మృతి చెందిన కుటుంబాలను మాత్రం గుర్తించలేకపోయారన్నారు.ఆ పన్నెండు వందల మంది విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు ఆదుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.

హరీష్ అగ్గిపెట్టేలేని ఆరాటం

కేసీఆర్ పోరాటమో, హరీష్ రావు అగ్గిపెట్టేలేని ఆరాటం వల్లనో తెలంగాణ రాలేదన్నారు. అందరు కలిసి పోరాడారని చెప్పారు. హరీష్ రావు అగ్గిపెట్టే లేకుండా చస్తానని బెదిరించి రెచ్చగొట్టారని, ఆ సమయంలో తాము లేకపోబట్టే బతికిపోయాడని, తాము ఉంటే మేమే అగ్గిపిల్ల గీసేవాళ్లమన్నారు.

పాలమూరు నుండి ఎదిగి

పాలమూరు నుండి ఎదిగిన కేసీఆర్.. అదే పాలమూరు బిడ్డలకు చేసిందేమిటని ప్రశ్నించారు. నల్గొండ, అదిలాబాద్ ఇలా అన్ని జిల్లాలను నిర్లక్ష్యం చేశారన్నారు. నల్లమల అడవుల నుండి గిరిజన బిడ్డల్ని వెళ్లగొట్టే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తున్నారని, ఈ విషయంలో చంద్రబాబు తమను చూడాలన్నారు.

నల్లమల అడవుల కోసం గిరిజన బిడ్డలను వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వేల ఏళ్లుగా చెంచులు నల్లమలలో జీవిస్తున్నారని, కానీ ఒక్క పులిని చంపిన దాఖలాలు లేవన్నారు. కానీ ఎందుకు వారిని ఖాళీ చేయించే కుట్రకు తెరలేపుతున్నారని ప్రశ్నించారు.

నల్లమల అడవులు వజ్రాలకు వేదిక అని, ఇలాంటి వజ్రాలను కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఇంత అరాచకమా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇది మనం కోరుకున్న బంగారు తెలంగాణ కాదన్నారు. కోహినూర్ వజ్రం మా జిల్లాలోనే దొరికిందని, అలాంటి వజ్రాలు ఉండటంతోనే కేసీఆర్ కన్ను నల్లమల పైన పడిందన్నారు.

 Revanth Reddy challenges KCR in Palamuru meeting

ఒక్క హామీ అయినా నెరవేర్చాడా

మైనార్టీలకు, ఇతరులకు రిజర్వేషన్ అని కుచ్చుటోపీ పెట్టాడన్నారు. ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు అయినా కట్టించాడా, మూడెకరాల భూమి దళితులకు ఒక్కరికైనా వచ్చిందా, ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా అని రేవంత్ నిలదీశారు. కేసీఆర్ తీరు మూడు ఎడ్లు, 36 దొడ్లు అన్నట్లుగా ఉందన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయనే సీఎం అయ్యారన్నారు. తాయిలాలు ప్రకటించి, అధికారంలోకి వచ్చాక అన్నీ వారే లబ్ధి పొందుతున్నారన్నారు.

కేసీఆర్ చేసింది ఇదీ

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చేసినవి ఏంటంటే.. సచివాలయాన్ని కూలకొట్టి ఎర్రగడ్డలో కొత్త సచివాలయాన్ని కట్టడం అన్నారు. ఈ మధ్య కేసీఆర్‌కు వెర్రి ఎక్కువైందన్నారు. అందుకే ఎర్రగడ్డకు పోతానని చెబుతున్నాడన్నారు. కేసీఆర్‌కు తిక్క కుదురుతుందన్నాడు. ఆయన తెలంగాణ పిత అని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

కేసీఆర్ తాగకుండా ఉండలేడు, కళ్లలోకి చూసి మాట్లాడలేడు

మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని గుజరాత్ ఇప్పటి వరకు మద్య నిషేధం అమలు చేస్తోందన్నారు. కానీ కేసీఆర్ మద్యం తాగకుండా ఒక్కరోజు ఉండలేడన్నారు. రెండు వేస్తే లేవలేడని, అలాంటి సన్నాసి తెలంగాణ తీసుకు వచ్చాడా అని దుయ్యబట్టాడు. కేసీఆర్ మా కళ్లలోకి సూటిగా చూసి మాట్లేడే ధైర్యం చేయలేడన్నారు.

తెచ్చింది వీరు, ఇచ్చింది వాళ్లు మరి ఆత్మహత్యల మాటేమిటి

తెలంగాణ తెచ్చింది తామని తెరాస, ఇచ్చింది తామని సోయిలేని కాంగ్రెస్ చెప్పుకుంటుందని, మరి ఆత్మహత్యలు చేసుకున్నోళ్ల మాటేమిటని ప్రశ్నించారు. ఆ బిడ్డలు ఎవరన్నారు. వాళ్ల వల్ల తెలంగాణ రాలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ రావణుడు అని, తాము రామలక్ష్మణులమని ఆయనను తుదముట్టిస్తామన్నారు.

ఆంధ్రా పార్టీ అయితే, పదవులెక్కడ అనుభవించావ్, కేటీఆర్ పేరు మార్చు

టీడీపీ ఆంధ్రా పార్టీ అని కేసీఆర్ చెప్పడం విడ్డూరమన్నారు. అలా అయితే, కేసీఆర్ పదవులు ఎక్కడ అనుభవించి, ఈ స్థాయికి వచ్చారని ప్రశ్నించారు. అంతేకాకుండా తన కొడుక్కి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారని, ఆ పేరును తీసేసి తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన శ్రీకాంత చారి లేదా కిష్టయ్య పేరు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఏడెనిమిది మంది సన్నాసులు ఇటీవల తెరాస కండువా కప్పుకున్నారన్నారు.

కేసీఆర్ తనకు అవసరమైతే ఆంధ్రోళ్లను పొగడుతాడని, లేదంటే తిడతాడని అన్నారు. సొమ్ములిస్తే ఆంధ్రోళ్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటాడన్నారు. రైతులను ఆదుకున్న చరిత్ర పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రైతులకు అండగా ఉన్నారని, కేసీఆర్ మాత్రం అలా లేరన్నారు.

టీడీపీని ఎవరూ కదిలించలేరు

తెలంగాణలో టీడీపీని కదిలించడం ఎవరి వల్లా కాదన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గుడ్లగూబ రాత్రుల్లో ఆకాశాన్ని చూసి తానే అంతా మోస్తున్నానని అనుకుంటుందని, అలాగే కేసీఆర్ కూడా 2019లోగా టీడీపీని లేకుండా చేస్తానని అనుకుంటున్నారని, కానీ అది సాధ్యం కాదన్నారు. టీడీపీని కచ్చితంగా అధికారంలోకి తెస్తామన్నారు.

1200మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు, భావితరాల కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగాలు చేశారని, రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఎవరూ త్యాగాలు చేయలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌, ఆయన బిడ్డలు సింహాసనంపై కూర్చుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు.

తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌, విమలక్క తదితర కవులు, కళాకారులు కీలకపాత్ర పోషించారన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం విమలక్కపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

సచివాలయం వద్ద రెండు రోజుల క్రితం ఒగ్గు కళాకారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన వ్యక్తం చేసిన సంగతి రేవంత్‌ గుర్తు చేశారు. శ్రీకాంతాచారి తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి చేసిందేమిటని ప్రశ్నించారు. ఆత్మ బలిదానాలు, ఉద్యమకారులు, కళాకారుల కుటుంబ సభ్యులకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+