Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో పైన శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. మార్చి నెల 15వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఎల్ అండ్ టి మెట్రో వ్యాపారం నుండి వైదొలుగుతున్నట్లు 76 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపట్టి, శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లోని ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా దూరం చేసేలా మెట్రో

శాసనమండలిలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. హైదరాబాద్‌లోని ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు మెట్రో రైలును మరో 76 కిలోమీటర్లు విస్తరించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఎల్‌ అండ్ టీ సంస్థ ముందుకు రాకపోవడంతో, ప్రభుత్వమే 15 వేల కోట్లతో మెట్రోను స్వాధీనం చేసుకుందని తెలిపారు.

Hyderabad Metro Expansion by 76 Km Govt Takes Over Project Worth 15 000 Crore CM revanth reddy

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో దేశంలో 12వ స్థానానికి

అలాగే, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. గత పదేళ్ల నిర్లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో దేశంలో 12వ స్థానానికి పడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దివంగత జయపాల్ రెడ్డి కృషితోనే మెట్రో రైలు ప్రాజెక్టు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. మాది గుడ్ గవర్నెన్స్ కాదు స్మార్ట్ గవర్నెన్స్ అని పేర్కొన్నారు.

33 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ

సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దు అంటూ హితవు పలికారు. అభివృద్ధిని కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయలేదన్నారు. 33 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని, కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలిస్తామని పేర్కొన్నారు.

సీఎం గారు లక్షమందిని కాపాడండి.. రేవంత్ రెడ్డికి వినూత్న విజ్ఞప్తి!
సీఎం గారు లక్షమందిని కాపాడండి.. రేవంత్ రెడ్డికి వినూత్న విజ్ఞప్తి!

మూసీ సుందరీకరణతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మారుస్తామని భరోసా

రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు ఎన్నికలప్పుడే అభివృద్ధి విషయంలో అందరూ ఒక్కటి కావాలి అని ఆయన పిలుపునిచ్చారు. మూసీ సుందరీకరణతో పాటు డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మారుస్తామని భరోసా ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+