"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ"

ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును సాకారం చేసి చూపించామని అన్నారు. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

"ఈ ప్రాజెక్టు సాకారం కావటంలో కృషి చేసిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్‌ ను అభినందిస్తున్నా. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. అనకాపల్లిలో కేవలం స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే కాదు.. స్టీల్ సిటీకి శంకుస్థాపన జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ తో పాటు 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతుంది" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

"2028 నాటికి ప్లాంట్‌లో మొదటి దశ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ ఫర్సెన్, డిసెంబరు నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేస్తారు. అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లేన్ల రహదారి కూడా పూర్తి అవుతుంది. పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్ లైన్ కూడా వేయబోతున్నారు. ఉక్కు ఉత్పత్తి ఒక్కటే కాదు ఆర్ధిక లావాదేవీలతో విద్య, వైద్యం, ఉద్యోగాలతో ఈ ప్రాంత రూపు రేఖలు మారతాయి" అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

"ఇంత వేగంగా పరిశ్రమకు భూసేకరణ, అనుమతులు ఇచ్చింది దేశంలో ఒక్క ఏపీలోనే.. దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం, రాష్ట్రం ఉంది. నిపుణులు, మానవ వనరులు ఏపీకి మాత్రమే సొంతం. టూరిజం నుంచి డేడా సెంటర్ వరకూ, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీ రంగం వరకూ అన్నింటికీ ఏపీలో మెండైన అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలతో వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అందరికీ పిలుపునిస్తున్నాను" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

"రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే నినాదాన్ని విజయవంతం చేస్తాం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావటం దేశంలో ఇదే తొలిసారి. బీపీసీఎల్ సహా పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లో రాష్ట్రానికి 20.35 లక్షల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. విశాఖ ఎకనామిక్ రీజియన్ నాలెడ్జి ఎకానమీ, పోర్టులు, స్టీల్, డేటా సెంటర్లు, ఐటీ సెంటర్లు ఇలా కీలకమైన కేంద్రంగా విశాఖ మారుతుంది. టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి. రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారుతుంది. పరిశ్రమలకు అవసరమైన నీటిని పోలవరం ద్వారా అందిస్తాం" అని సీఎం చంద్రబాబు తెలిపారు.

"కొత్తగా పోర్టులు, ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తాం. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకునేందుకు సహకారం ఇస్తాం. ఈ పరిశ్రమ నిర్మాణంలో రైతులు తమ భూములను త్యాగం చేశారు. వారికి సహకారం అందించాలని కోరుతున్నాను. ఉక్కు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Chandrababu Naidu at ArcelorMittalNippon Steel Groundbreaking Key Remarks Nippon Steel Naidu speech

"మొదటగా అనకాపల్లి జిల్లా యువతకు ఈ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాను. ఆవిష్కరణల కోసం ఈ మెటలర్జీ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+