కేంద్రం దిద్దుబాటు: నాకే తెలియదంటున్నారు.. : పాయింట్ లాగిన జైట్లీ
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. డిమాండ్‌కు తగిన నగదు లేక బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. దీంతో కేంద్రం చర్యలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా నగదు బ్యాంకులకు చేర్చేందుకు పట్టే సమయాన్ని ఇరవై ఒక్క రోజుల నుంచి ఆరు రోజులకు కుదించింది. నోట్లు ముద్రణాలయం నుంచి ప్రధాన కేంద్రాలకు చేర్చేందుకు అన్ని రకాల రవాణా సాధనాలను ఉపయోగించాలని నిర్ణయించింది.

హెలికాప్టర్స్‌తో పాటు భారత వాయుసేనకు చెందిన విమానాలను వినియోగిస్తోంది. మరో వారం రోజుల్లో ప్రస్తుత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి కొంచెం మెరుగవడంతో గ్రామీణ ప్రాంతాలపై ప్రభుత్వ వర్గాలు దృష్టిపెడుతున్నాయి.
కాగా, రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రజలందరూ స్వాగతించారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. నోట్ల రద్దు ఆర్థికమంత్రి కూడా తెలియకుండా చేశారని విపక్షాలు అంటున్నాయని, అలాంటప్పుడు పార్టీ నేతలకు ఎలా తెలుస్తుందో చెప్పాలన్నారు. బీజేపీ నేతలకు, అదానీ, అంబానీలకు ముందే తెలుసునని విపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నా ప్రతిపక్షాలు కావాలనే సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లోకి నగదును తరలించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications