పెద్దనోట్ల రద్దుకు జనం జేజేలు?: ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి, ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశ ప్రజలు మద్దతు పలుకుతున్నట్లు ముంబై, గుజరాత్‌లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి, ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ సాధించింది. వల్సద్ జిల్లాలోని 44 మున్సిపాలిటీలకు గాను 41 మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంది. కనక్‌పూర్-కన్సద్ (సూరత్) మున్సిపాలిటీల్లోని 28 సీట్లకు 27 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది.

గోండల్ తాలూక పంచాయతీలో 22 సీట్లలో బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది. జిల్లా పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుకుది. ఏడు పంచాయతీలకు గానూ 5 పంచాయతీలు బీజేపీ గెలుచుకుంది. 15 తాలూకా పంచాయతీల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ 5, కాంగ్రెస్ 4 గెలుచుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల తక్కిన సీట్ల ఫలితాలు వెల్లడించలేదు.
ఎన్నికల్లో బిజెపి గెలుపుపై మోడీ హర్షం: ప్రజలకు కృతజ్ఞతలు

మహారాష్ట్ర, గుజరాత్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న పోరుకు ప్రజలు మద్దతిస్తున్నారని ఈ ఫలితాలతో తేలిపోయిందని మోడీ అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకాన్ని ఉంచారని అన్నారు.
Poll results clearly show that extreme steps taken by PM, #SurgicalStrike & #DeMonetisation have worked: Vijay Rupani, Gujrat CM pic.twitter.com/aMbCorq5DQ
— ANI (@ANI_news) 29 November 2016
Out of 126 seats BJP won 109 & Congress win only 17. This is the #Janakrosh by public of Gujarat for Congress. Analysis of #bypolls; pic.twitter.com/GoD3jTiyHg
— Mansukh Mandaviya (@mansukhmandviya) 29 November 2016
గుజరాత్‌లో బిజెపి విజయం సాధించేందుకు సీఎం విజయ్‌రూపాని, ఆ రాష్ట్ర బిజెపి నేత, ఎమ్మెల్యే జితూ వాఘాని ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి.
పశ్చిమ్‌బంగా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో బిజెపిప్రదర్శన బాగుందంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా గెలుపు.. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న ప్రతిపక్షాలకు మేలుకొలుపు కావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications