రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!
రైతు భరోసా పెండింగ్ నిధుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా రెండో విడత నిధుల జమ పైన స్పష్టత ఇచ్చింది. మూడు విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది. కాగా, రెండో విడత నిధులు ఏ కేటగిరీలో రైతుల ఖాతాల్లో జమ చేయనుందో స్పష్టం చేసింది. దీంతో, రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రైతులకు రిలీఫ్ దక్కనుంది.
రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరీ కీలక అప్డేట్ ఇచ్చింది. రైతు భరోసా పథకంలో భాగంగా రెండో విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ తాజాగా రైతుల భరోసా నిధుల పైన సమీక్ష చేసారు. రైతులకు ఇచ్చిన హామీ విధంగా నిధులు జమ చేయాలని నిర్దేశించారు. అందులో భాగంగా ఆర్థిక శాఖ రూ.2,650 కోట్లను సమీకరించే పనిలో పడింది. ప్రభుత్వ ఖర్చులు, ఇతర చెల్లింపులతో పాటుగా రైతులకు భరోసా కింద అవసరమైన నిధులు అందించేందుకు అధికారులు కార్యాచరణ సిద్దం చేసారు. రెండో విడతలో ఎకరానికి మించి భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా సుమారు 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు ఈ దఫాలో ప్రయోజనం పొందనున్నారు.

ఈ నెలలోనే పెండింగ్ నిధుల జమకు ప్రణాళికలు
కాగా, ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో ఇప్పటికే 70 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్లను మార్చి 22న జమ చేశారు. దీంతో వ్యవసాయ పనులకు కొంత ఆర్థిక ఊరట లభించింది. మిగతా రైతులకు మూడో విడతలో నిధులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈనెల చివరినాటికి మొత్తం చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున సాయం అందిస్తున్న ప్రభుత్వం, మొత్తం పథకం అమలుకు దాదాపు రూ.9 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. నిధుల పరిమితి కారణంగా ఈసారి మూడు దశల్లో డబ్బులు విడుదల చేస్తోంది. ఇప్పుడు రెండో విడత నిధుల పైన స్పష్టత రావటంతో పెద్ద సంఖ్య లో రైతులకు ప్రయోజనం దక్కనుంది. అదే విధంగా మూడవ, చివరి విడతను ఏప్రిల్ నెలాఖరు లోగా జమ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా రైతు భరోసా పంపిణీ పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసారు.
-
మహిళలకు శుభవార్త.. మీ కోసమే మరో 40 పెట్రోల్ బంకులు! -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
లక్షలు ఖర్చయ్యే క్యాన్సర్ రేడియేషన్ థెరపీ ఇప్పుడు నిమ్స్ లో ఉచితం.. శుభవార్త! -
తెలంగాణా వైద్య, ఆరోగ్య రంగంలో భారీ నియామకాలు.. ఇది చారిత్రక ఘట్టం అన్న మంత్రి -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..!













Click it and Unblock the Notifications