వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉర్జీత్ దాకా.. ఆర్నెళ్ల ప్లాన్, మోడీకి పాలాభిషేకం చేసేవారు: నోట్ల రద్దుపై షాకింగ్ సీక్రెట్స్!

సీపీఐ నేత నారాయణ ప్రధాని నరేంద్ర మోడీ పైన మంగళవారం నాడు మరోసారి ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ, బీజేపీ ఆర్థిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: సీపీఐ నేత నారాయణ ప్రధాని నరేంద్ర మోడీ పైన మంగళవారం నాడు మరోసారి ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ, బీజేపీ ఆర్థిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా నోట్ల రద్దు ఎందుకు చేశారో చెప్పాలని నిలదీశారు.

ఇరువురు సీఎంలపై ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుల పైన కూడా నారాయణ మండిపడ్డారు. ఇద్దరు చంద్రులు మోడీ భజన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వారు మోడీ భజన మానుకోవాలని హితవు పలికారు.

కార్పొరేట్‌ సంస్థలకు వేల కోట్ల రూపాయలు సమర్పించేందుకే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందన్నారు. తద్వారా సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ప్రజా కోర్టులో నరేంద్ర మోడీని గుంజీలు తీయించినా తప్పు లేదన్నారు.

మోడీకి షాక్: 'రూ.2000 నోటుపై ఉర్జీత్ సంతకం ఎలా, నోట్ల రద్దు వెనుక పెద్ద స్కాం' మోడీకి షాక్: 'రూ.2000 నోటుపై ఉర్జీత్ సంతకం ఎలా, నోట్ల రద్దు వెనుక పెద్ద స్కాం'

నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ, ఆరెస్సెస్‌లు మతతత్వ విద్వేషాలను రెచ్చగొడుతున్నాయన్నారు. రూ.లక్షల కోట్లు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా లాంటివాళ్లను శిక్షించకుండా సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

demonetisation

ఆర్నెల్ల ముందే రద్దు ప్లాన్.. ఉర్జిత్ పటేల్ ఇలా..

నోట్ల రద్దు.. సామాన్యులపై మోడీ చేసిన సర్జికల్‌ స్ట్రయిక్ అన్నారు. ఆరు నెలల ముందే రద్దుకు పునాది వేశారని, కావాలనే గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా మోడీ నియమించారన్నారు.

జగన్ కంటే చంద్రబాబే బెటర్ అనుకుంటున్న కేసీఆర్!జగన్ కంటే చంద్రబాబే బెటర్ అనుకుంటున్న కేసీఆర్!

లెక్క తీస్తే ప్లాన్ అంతా బయటపడుతుంది

నోట్ల రద్దుకు మూడునెలల ముందు లెక్కలు బయటికి తీస్తే పథకం ప్రకారం చేసిన కుట్ర బయట పడుతుందన్నారు. వామపక్షాలు నల్లకుభేరులకు మద్దతుగా ఉన్నాయన్న కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను ఖండించారు.

నోట్ల రద్దు వల్ల నల్లకుభేరులకు ఏమీ కాలేదని, వారు ప్రైవేటు బ్యాంకుల ద్వారా నల్లధనాన్ని తెల్లగా ఎప్పుడో మార్చుకున్నారన్నారు. అరవై మంది సామాన్య ప్రజలు చనిపోయారన్నారు.

నోట్ల రద్దుకు ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే మోడీకి పాలాభిషేకం చేసేవారన్నారు. యూపీ ఎన్నికల్లో గెలవడం కోసం దేశం ఏమైనా ఫర్వాలేదని నోట్ల రద్దు చేశారన్నారు.

English summary
narendra modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X