వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవును, చంద్రబాబు నాయుడు కన్వీనర్ అయితే తప్పేంటి?: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా స్పందించారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలు, ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో అయిదుగురు ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రం ఓ కమిటీ వేసింది.

జగన్‌తో నష్టం, టిడిపియే బెస్ట్!: చేయి కలపడం వెనుక.. ఇదీ కేసీఆర్ లెక్క, బాబుకు ఊరటజగన్‌తో నష్టం, టిడిపియే బెస్ట్!: చేయి కలపడం వెనుక.. ఇదీ కేసీఆర్ లెక్క, బాబుకు ఊరట

ఈ నేపథ్యంలో సోమవారం నాడు చంద్రబాబుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఫోన్ చేశారు. పరిణామాల పైన చర్చించారు. అనంతరం ఐదుగురు ముఖ్యమంత్రులతో కమిటీ వేయాలనుకుంటున్నట్లు, దానికి నేతృత్వం వహించాలని కూడా చెప్పిన విషయం తెలిసిందే. అనంతరం మంగళవారం కమిటీ వేసారు. చంద్రబాబు నేతృత్వం వహిస్తారు.

chandrababu naidu - kcr

చంద్రబాబు కన్వీనర్ కాకముందే, ఈ విషయమై విలేకరులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడగగా ఆయన స్పందించారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాల పైన ఓ కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించిందని, దానికి చంద్రబాబును నేతృత్వం వహించాలని కేంద్రం కోరిందని, దీనిపై ఏమంటారని విలేకరులు అడిగారు.

దానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కన్వీనర్‌గా ఐదుగురు ముఖ్యమంత్రులతో కమిటీ వేయడంలో తప్పేమిటని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాగా, ఓటుకు నోటుతో ఇరువురి మధ్య విభేదాలు, ఆ తర్వాత కొంతకాలానికి సానుకూలత కనిపిస్తోన్న విషయం తెలిసిందే.

English summary
What is wrong if CM's committee is set up with Chandrababu as its convener?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X