2017కల్లా వైమానిక యుద్ధ రంగంలో మహిళా పైలట్లు
ఢిల్లీ: మహిళలు త్వరలో యుద్ద విమానాల్లో దూసుకెళ్తూ ధైర్య సాహసాలు చాటనున్నారు. యుద్ధ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలన్న చిరకాల ప్రతిపాదన అమలు దిశగా తొలి అడుగు పడింది. భారత యుద్ధ విమానాల్లో మహిళా పైలట్ల నియామక ప్రతిపాదనను కేంద్రం శనివారం నాడు ఆమోదించింది.
ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్ నుంచి 2016 జూన్ నాటికి మహిళా పైలట్లను నియమించనున్నారు. ఆ తర్వాత ఏడాది పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి 2017 జూన్ నాటికి పూర్తిస్థాయి పైలట్లుగా నియమిస్తారు.

వాయుసేనలో మహిళా పైలట్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం ద్వారా... సైనిక దళాల్లో నేరుగా యుద్ధ క్షేత్రంలో పని చేసే విభాగాల్లో మహిళలు నియామకం కానుండటం ఇదే తొలిసారి.
ప్రస్తుతం వైమానిక అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్‌లో నుంచి తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లను ఎంపిక చేయనున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. భారతీయ మహిళల ఆకాంక్షలను, అభివృద్ధి చెందిన దేశాల సైనిక దళాల ధోరణికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications