ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన!

వెండితెరపై 'ది కేరళ స్టోరీ' చూసినప్పుడు అది కేవలం సినిమా అని సరిపెట్టుకున్న వారికి.. హైదరాబాద్‌లోని కుందన్ బాగ్ పరిసరాల్లో వెలుగుచూసిన ఈ ఘటన కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది. ప్రేమ పేరుతో వల వేయడం, మతం మార్చడం, ఆపై చిత్రహింసలకు గురిచేయడం.. సినిమాలో మనం చూసిన 'ట్రాప్' ఇప్పుడు భాగ్యనగరంలో అక్షరాలా పునరావృతమైంది. అద్దెకు దిగిన ఒక వ్యక్తి, యజమాని కూతురినే లక్ష్యంగా చేసుకుని ఆడిన ఈ మాయాజాలం వింటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది.

సినిమాలో ఎలాగైతే బాధితులను మెల్లమెల్లగా తమ దారిలోకి తెచ్చుకుంటారో, ఇక్కడ 'నవాజ్' అనే వ్యక్తి అదే పద్ధతిని అనుసరించాడు. బాధితురాలి కథనం ప్రకారం.. 2021 మే నెలలో నవాజ్ ఆమెకు పరిచయమయ్యాడు. 'నో బ్రోకర్' యాప్ ద్వారా ఆమె పెట్టిన షాపు అద్దె ప్రకటన చూసి అతను వచ్చాడు. తాను హిందూ మతంలోకి మారానని, తన పేరు 'నవదుర్గ' అని చెప్పి ఆమె నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు కూడా అతను హిందువుగా మారాడని అబద్ధాలు చెప్పి ఆమెను నమ్మించారు. కానీ, ఆ నమ్మకం వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉందని ఆమె ఊహించలేకపోయింది.

Betrayed by Love Man Poses as Hindu to Marry Hyderabad Woman Later Forces Conversion and Abortion

రిసార్ట్ మాయాజాలం.. మత్తులో అరాచకం!

కేరళ స్టోరీలో యువతులను ఎలాగైతే ట్రాప్ చేస్తారో, ఇక్కడ కూడా రిసార్ట్ పేరుతో ఒక పక్కా ప్లాన్ అమలు చేశారు. 2021 మే 24న నవాజ్ ఆమెను ఒక రిసార్టుకు తీసుకెళ్లాడు. అక్కడ తన కుటుంబ సభ్యులు వస్తారని నమ్మబలికాడు. కానీ ఎవరూ రాలేదు. ఈ టైంలోనే జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఆమెపై పైశాచికంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. స్పృహ లేని సమయంలో తీసిన నగ్న ఫోటోలే ఆ తర్వాత ఆమె పాలిట శాపంగా మారాయి. ఆ ఫోటోలను చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి, ఆమెను బలవంతంగా వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమెకు ఎదురైన పరిస్థితులు ఒక సినిమాను మించిన భయానక వాస్తవాలు.

నజీరాగా మార్పు.. గొడ్డు మాంసంతో హింస!

వివాహం కాగానే 'నవదుర్గ' ముసుగు తొలగిపోయి 'నవాజ్' అసలు స్వరూపం బయటపడింది. ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి 'నజీరా'గా నామకరణం చేశారు. అంతటితో ఆగక, శాకాహారి అయిన ఆమెతో బలవంతంగా గొడ్డు మాంసం తినిపించడం, ఇంట్లో పూజలు చేయకుండా అడ్డుకోవడం వంటి చర్యలతో ఆమెను మానసిక క్షోభకు గురిచేశారు. గర్భం దాల్చిన సమయంలో ఆమెకు తెలియకుండానే మందులు ఇచ్చి గర్భస్రావం చేయించడం ఆ ముఠా క్రూరత్వానికి పరాకాష్ట.

వ్యవస్థీకృత నేరం.. బాధితురాలి ఆర్తనాదం!

ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన పని కాదు, ఒక వ్యవస్థీకృత నేరం (Organized Crime) అని బాధితురాలి ఆరోపణలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు రూ. 30 లక్షల నగదు, బంగారం, ఆస్తులను కాజేయడమే కాకుండా, ఆమె సోదరిపై కూడా కన్నేసి బెదిరింపులకు పాల్పడ్డారు. నవాజ్‌తో పాటు అతని సోదరులు మునావర్, షారూఖ్, సోహైల్, ఇస్మాయిల్.. సోదరీమణులు రేష్మ, నసీమా అంతా కలిసి ఈ కుట్రలో భాగస్వాములని ఆమె ఆరోపించింది.

పోలీసుల నిర్లక్ష్యంపై ఆవేదన!

ఇంత జరుగుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. "నేను మోసం జరిగిందని కేసు పెడితే, వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. నన్ను రేప్ చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి అధికారులతో సరదాగా మాట్లాడి వెళ్తున్నాడు తప్ప, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు" అని ఆమె ఆరోపించింది.

'ది కేరళ స్టోరీ' కేవలం కేరళకే పరిమితం కాలేదని, మన పక్కింట్లో కూడా ఇలాంటి నవాజ్‌లు నవదుర్గలుగా ముసుగు వేసుకుని పొంచి ఉన్నారని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+