భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..
సమ్మర్ సీజన్ మొదలైంది. సమ్మర్ లో చాలామంది ఫ్యామిలీతో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. యువత కూడా ఫ్రెండ్స్ తో కలిసి అలా వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. కొత్త ప్రదేశాల్లో, భిన్నమైన వాతావరణంలో ఉత్సాహంగా గడపాలని భావిస్తుంటారు. అయితే భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. హిమాలయాల నుంచి కన్యాకుమారి సముద్ర తీరాల వరకూ అలాగే రాజస్థాన్ ఎడారుల నుంచి కేరళ బ్యాక్ వాటర్స్ వరకు ప్రతి ప్రాంతంలో ఏదో ఒక టూరిస్టు ప్రాంతం పర్యటకులను కనువిందు చేస్తోంది. మరి వాటిని సందర్శించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా..?
కేవలం భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తున్న భారత్ లోని బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలను ఇక్కడ చూద్దాం.. ఇన్ క్రెడిబుల్ ఇండియా వెబ్ సైట్ లో పొందు పరిచిన వివరాల ప్రకారం ఈ పర్యాటక ప్రాంతాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరాల్లో వారణాసి ఒకటి. ఈ నగరం గంగా నది ఒడ్డున నెలకొని ఉంటుంది. వారణాసిలో గంగా హారతి, ఘాట్లు, కాశీ విశ్వేర్వరుడి ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రయాణానికి వారణాసి అత్యుత్తమమైన ప్రదేశం అని చెప్పొచ్చు.
మరో టూరిస్టు ప్రాంతం ఆగ్రాలోని తాజ్ మహల్. తాజ్ మహల్ కట్టడం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో తాజ్ మహల్ ఒకటిగా ప్రసిద్ధి. ఈ అద్భుతమైన కట్టడాన్ని ఆనాటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కు జ్ఞాపకార్థంగా కట్టించాడు. తాజ్ మహల్ ను తెల్లటి మార్బుల్ తో నిర్మించారు. తాజ్ మహల్ ను చూసేందుకు ఏటా లక్షలాది మంది పర్యటకులు ప్రపంచ దేశాల నుంచి వస్తుంటారు.

ఇక గోవా అనగానే ముందుగా గుర్తొచ్చేది బీచ్ లు. మనదేశంలోని ప్రసిద్ధమైన బీచ్ లకు గోవా నెలవుగా ఉంది. గోవాలో కాలాంగుట్, బాగా, అంజునా వంటి బీచ్ లు, పోర్చుగీస్ ఆర్కిటెక్చర్, స్పానిష్- పోర్చుగీస్ వంటకాలు, ఫెస్టివల్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. బీచ్ పార్టీలు, వాటర్ స్పోర్ట్స్, పీస్ ఆఫ్ మైండ్ ను కోరుకునే వారికి గోవా సరైన గమ్య స్థానం అని చెప్పొచ్చు. అలాగే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్, జైపూర్, జోధ్ పూర్ ప్రాంతాలు కూడా ప్రముఖ పర్యటక ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక రాజస్థాన్ సాంస్కృతిక, సంగీతం, వస్త్రాలు, ఆహారం పరంగా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి.












Click it and Unblock the Notifications