పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- అమెరికా- ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు విరుచుకుపడుతున్నాయి.. అదే సమయంలో ఇరాన్ ఆ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. మరోవైపు యుద్ధం కారణంగా ఇరాన్ తన బ్రహ్మాస్త్రమైన హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దాంతో అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్ లో గ్యాస్, చమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోయాయి. అయితే పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది.
పెట్రోల్ కొరత కారణంగా నేపాల్ లో వారానికి రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం, ఆదివారం సెలవు రోజులుగా ప్రకటించారు. గతంలో శనివారం ఒక్కరోజు మాత్రమే సెలవు ఉండేది. కానీ ప్రస్తుత పరిణామాల మధ్య రెండు రోజుల పాటు సెలవు దినాలు ప్రకటించారు అధికారులు. ఇదే విషయంపై ప్రభుత్వ అధికార ప్రతినిధి సాస్మిత పోఖారెల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల పని దినాలను కూడా సవరించినట్లు తెలిపారు. గవర్నమెంట్ కార్యాలయాలు ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేస్తాయని పేర్కొన్నారు.
దేశంలో పెట్రోల్ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి సాస్మిత పోఖారెల్ తెలిపారు. తాజాగా తీసుకున్న నిర్ణయాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. శని, ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైమింగ్స్ కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమేనని విద్యాసంస్థలకు కాదని స్పష్టం చేశారు.

ఇక ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా నేపాల్ అట్టుడుకుతోంది. విమాన ఇంధన ధరలను అక్కడి ప్రభుత్వం 117.4 శాతం పెంచేసింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తుంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ ఇంధన ధరలను పెంచేసింది. అంతర్జాతీయ విమానాలకు ఇంధన ధరలను వరుసగా 84.7 శాతం, 116.2 శాతం, 117.4 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు నేపాల్ రాజధాని ఖాత్ మండూ లో లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 202 గా ఉంది. డీజిల్, కిరోసిన్ ధరలు కూడా లీటర్ కు రూ. 182 కు పెరిగాయి. దాంతో నేపాల్ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications