7.2 శాతం జీడీపీ వృద్ధి రేటుతో మళ్లీ చైనాను వెనక్కినెట్టిన భారత్!
న్యూఢిల్లీ: గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) వృద్ధిరేటు మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7.2 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికం. దీంతో మరోసారి చైనాను వెనక్కి నెట్టి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది.
ఈ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిపుణుల అంచనాలను మించి వృద్ధి రేటు నమోదవడం విశేషం. అంతకుముందు త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా మాత్రమే ఉంది. వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాలతో పాటు వివిధ రంగాల్లో మెరుగైన వృద్ధి నమోదు జీడీపీ పెరుగుదలకు కారణమని బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది.

ప్రభుత్వం వ్యయం పెరగడం వృద్ధిరేటుకు దోహదపడిందని ఆర్థికవేత్త అభిషేక్ ఉపాధ్యాయ చెప్పారు. బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తుల విలువ పెరుగుతుండటంపై ఈ మధ్యే ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు.
వీటిని కట్టడి చేయకపోతే అది ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు వరుస కుంభకోణాలతో సతమతవుతున్న మోడీ సర్కార్‌కు జీడీపీ వృద్ధి రేటు అంశం కాస్తా ఊరట ఇవ్వవచ్చునని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications